Jasprit Bumrah Injury: టీమిండియా కు ఊహించని ఎందుకు దెబ్బ తగిలింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ , కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) గ్రౌండ్ వదిలి బయటకు వెళ్ళాడు. స్కానింగ్ నిమిత్తం టీమిండియా కెప్టెన్ బుమ్రాను ఆసుపత్రికి తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాదు గ్రౌండ్ వదిలి.. ప్రాక్టీస్ జెర్సీ వేసుకున్న జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah)… ప్రత్యేక కారులో ఆసుపత్రికి వెళ్లినట్లు వీడియో కూడా బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Rohit sharma Retirement: నేను పిచ్చోన్నికాదు…రిటైర్మెంట్ పై రోహిత్ సంచలన ప్రకటన !
ఇక ఈ వీడియో చూసిన టీమిండియా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే టీమ్ ఇండియా కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) కు గాయం అయిందా అని? కామెంట్స్ చేస్తున్నారు. లంచ్ బ్రేక్ వరకు.. టీమిండియా అద్భుతంగా ఆడింది. అప్పటికే ఆస్ట్రేలియా ను ముప్పతిప్పలు పెట్టిన టీమ్ ఇండియా బౌలర్లు 5 వికెట్లు తీశారు. ఇక లంచ్ తర్వాత కూడా అదే ఊపును కొనసాగిస్తోంది టీం ఇండియా.
లంచ్ బ్రేక్ తర్వాత కూడా మరో నాలుగు వికెట్లు తీసింది టీమిండియా. అయితే లంచ్ బ్రేక్ తర్వాత ఒకే ఒక్క ఓవర్ వేశాడు జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah). ఆ తర్వాత మ్యాచ్ లో ఎక్కడ కనిపించలేదు బుమ్రా. ఈ తరుణంలోనే… బుమ్రాను ఆసుపత్రికి తీసుకు వెళ్లిన వీడియో వైరల్ గా మారింది. జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) కాలికి గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు 10 ఓవర్లు వేసిన టీమ్ ఇండియా కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah)…. రెండు వికెట్లు కూడా పడగొట్టాడు.
అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) కు గాయం అయినట్లు ఎక్కడ వీడియో కనిపించలేదు. నేరుగా అతన్ని ఆసుపత్రికి తీసుకు వెళ్లిన వీడియో మాత్రమే బయటికి వచ్చింది. అయితే స్కానింగ్.. చేసిన తర్వాత టీమిండియా కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) హెల్త్ అప్డేట్ రానుంది. ఒకవేళ గాయం తీవ్రతరం అయితే… తర్వాత అతను బౌలింగ్ చేయడం కష్టం. టీమిండియా కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) బౌలింగ్ చేయకపోతే జట్టు గెలవడం కూడా అసాధ్యం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో… టీమిండియా కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) బౌలింగ్ చాలా అవసరం.
Also Read: Ind vs Aus 5th Test Day 2: ఆసిస్ కి బిగ్ షాక్.. కుప్పకూలిన టాప్ ఆర్డర్!
ఆస్ట్రేలియాను గత నాలుగు టెస్టుల నుంచి ముప్పతిప్పలు పెడుతున్నాడు. ఈ మ్యాచ్ లో కూడా చుక్కలు చూపించాడు. అలాంటి జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah) లేకపోతే… కీలక మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడం గ్యారంటీ అని భయపడుతున్నారు. ఇక ఇప్పటి వరకు టీమిండియా బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీస్తే… మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీశాడు. అటు ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధి కృష్ణ 3 వికెట్లు పడగొట్టి రాణించాడు. ఆల్ రౌండర్ నితీర్ కుమార్ రెడ్డి కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేసింది. మరో ఐదు ఓవర్ల లోపే ఆస్ట్రేలియా ఆల్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక బుమ్రా గ్రౌండ్ లో లేకపోవడంతో…విరాట్ కోహ్లీ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు.
Jasprit Bumrah has left the SCG: https://t.co/0nmjl6Qp2a pic.twitter.com/oQaygWRMyc
— cricket.com.au (@cricketcomau) January 4, 2025