BigTV English
Advertisement

Maimitha Baiju : బాబోయ్..నిర్మాతలకు బిగ్ షాక్ ఇచ్చిన ‘ప్రేమలు’ బ్యూటీ..

Maimitha Baiju : బాబోయ్..నిర్మాతలకు బిగ్ షాక్ ఇచ్చిన ‘ప్రేమలు’ బ్యూటీ..

Maimitha Baiju : గత ఏడాది మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో ప్రేమలు సినిమా ఒకటి.. చిన్న స్టోరీ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన మమత బైజు క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సినిమా హిట్ అవడంతో ఆమె అందానికి యువత ఫిదా అయ్యారు. దాంతో యూత్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమె గురించి ఎటువంటి న్యూస్ వచ్చినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంది. అయితే తాజాగా ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం..


నిర్మాతలకు షాక్ ఇస్తున్న మమితా బైజు.. 

ప్రేమలు హీరోయిన్ మమిత బైజు ఈ మూవీ కన్నా ముందే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ ఈ మూవీ ఇచ్చిన క్రేజ్ తో ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ అయ్యింది. ప్రేమలు సినిమాకు తెలుగు ప్రేక్షకులు ఫుల్లుగా ఆదరణ కురిపించడంతో నేరుగా తెలుగులోనే ఓ సినిమా చేస్తున్నది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై డ్రాగన్ సినిమా ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న డ్యూడ్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కీర్తీశ్వరన్  దర్శకత్వం వహించారు. ఇందులో మమిత బైజు హీరోయిన్.. అయితే ఈ మూవీకి రెమ్యూనరేషన్ పెంచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీకి ప్రదీప్ రంగనాథన్‌తో హీరోయిన్‌గా చేస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ సినిమా కోసం మైత్రీ మూవీ మేకర్స్ భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారనేది ఫిలిం ఇండస్ట్రీలో టాక్. ఆమెకు సుమారుగా 50 లక్షల నుంచి 70 లక్షల పారితోషికం అందిస్తున్నారు అని పేర్కొన్నారు. అలాగే విజయ్ మూవీకి దాదాపు కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం…


Also Read: సుడిగాలి సుధీర్ ఇంట సంబరాలు.. మరోకరి ఎంట్రీ తో…

సినిమాల విషయానికొస్తే.. 

మమిత బైజు 2017 లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు అంత క్రేజ్ అయితే రాలేదు. కానీ ప్రేమలు తర్వాత మాత్రం ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలు ఈ మధ్య బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి. గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజ్ అయిన మూవీలలో ప్రేమలు ఒకటి. ఒక చిన్న ప్రేమ కథగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది. కోట్లు రాబట్టి సూపర్ హిట్ అయ్యింది. ఆ చిత్రంలో హీరోయిన్ గా మమిత బైజు నటించింది. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అవ్వడమే కాదు.. ఆమె క్యూట్ అందాలతో కుర్రాళ్ళను ఆకట్టుకుంది. ప్రేమలు సినిమా తర్వాత ఆమె పాత వీడియోలు, రీల్స్, డ్యాన్స్ క్లిప్పులు ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి.. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.. త్వరలోనే ఆ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×