Thug Life: కోలీవుడ్ లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్(Kamal Hassan) సినిమా అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. కమల్ హాసన్ సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. తాజాగా ఈయన థగ్ లైఫ్(Thug Life) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం(Maniratnam) దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా సినిమా అంటే ఆ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాయకుడు సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే థగ్ లైఫ్ సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనా ఏర్పడ్డాయి.
మణిరత్నం గారి పై అభిమానం..
ఎన్నో అంచనాల నడుమ జూన్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని భాషలలో డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను కూడా తీసుకువచ్చింది. అయితే ఈ సినిమా గురించి తాజాగా బాలీవుడ్ నటుడు అలీ ఫజల్(Ali Fazal) చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అలీ ఫజల్ కూడా ఈ సినిమాలో ఓ పాత్రలో నటించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎందుకు నటించావు?
నిజానికి తాను ఇప్పటివరకు థగ్ లైఫ్ సినిమా చూడలేదని వెల్లడించారు. ఈ సినిమాలో తాను నటించడానికి కారణం మణిరత్నం గారు అని తెలిపారు. కేవలం మణిరత్నం సార్ పట్ల ఉన్న అభిమానంతోనే ఈ సినిమా కథ ఏంటి అని కూడా ఆలోచించకుండా ఇందులో నటించానని తెలిపారు. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత నా కుటుంబ సభ్యులు, స్నేహితులు అసలు ఈ సినిమాలు ఎందుకు నటించావు? ఈ సినిమా చేయకుండా ఉండాల్సింది.. అంటూ నన్ను తిడుతున్నారని ఆలీ ఫజల్ వెల్లడించారు. ఇలా వారు నన్ను తిడుతున్నప్పటికీ మరేం పర్వాలేదని నేను సమాధానం చెబుతూ వచ్చానని వెల్లడించారు. మణిరత్నం సార్ విజన్ ప్రశ్నించే అంత పెద్దవాడిని కాదని తెలిపారు.
థగ్ లైఫ్ చాప్టర్ ముగిసింది …
సినిమా కోసం వారు చేయాల్సిందంట చేశారని, అయితే కొన్నిసార్లు ఫలితం మన చేతులలో ఉండదని తెలిపారు..థగ్ లైఫ్ చాప్టర్ అక్కడితో ముగిసిపోయిందని, మరోసారి నాకు మణిరత్నం గారి దర్శకత్వంలో సినిమా చేసే ఛాన్స్ వస్తే ఆ అవకాశాన్ని వదులుకోకుండా తప్పకుండా నటిస్తాను అంటూ అలీ ఫజల్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా విడుదల సమయంలో కమల్ హాసన్ కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యల కారణంగా పెద్ద ఎత్తున వివాదంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ వివాదం కారణంగా కర్ణాటకలో ఈ సినిమా విడుదలకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఏదిఏమైనా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక నిరాశపరిచిందని చెప్పాలి.
Also Read: Vijay Devarakonda: హాస్పిటల్ పాలైన నటుడు విజయ్ దేవరకొండ.. ఏం జరిగిందంటే?