HBD Preity Zinta:మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా రాజకుమారుడు(Rajakumarudu )సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా(Priety zinta). తొలిసారి హిందీ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె , ఆ తర్వాత తన అందంతో, అభినయంతో పలు భాషా దర్శక నిర్మాతలను ఆకర్షించింది. హిందీ , తెలుగుతోపాటు పంజాబీ, ఇంగ్లీష్ సినిమాలలో కూడా నటించి ఆకట్టుకుంది. 1975 జనవరి 31వ తేదీన హిమాచల్ ప్రదేశ్ ‘సిమ్లా’లో జన్మించింది ప్రీతి జింటా. ఇక ఈరోజు ఈమె పుట్టిన రోజు కావడంతో ఈమెకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ప్రీతి జింటా తొలి పరిచయం..
చదువు పూర్తయిన తర్వాత సినిమా రంగంలోకి రావాలనుకున్న ఈమె మొదట మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అలా మొదటిసారి ఈమె నటించిన ‘పెర్క్’ చాక్లెట్ ప్రకటన పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత ‘లిరిల్ సబ్బు’ ప్రకటనల్లో కూడా పనిచేసింది ప్రీతిజింటా. ఇక 1997లో ఒక సినిమా ఆడిషన్ కు వెళ్ళిన ప్రీతిని దర్శకుడు శేఖర్ కపూర్(Sekhar Kapoor) చూసి ఆడిషన్ నిర్వహించి, ఆమెను నటి అవమని సలహా ఇచ్చారట. అలా తన సినిమా ‘తరరంపం’లో నటించేందుకు ప్రీతి జింటాను ఒప్పించారు. హృతిక్ రోషన్ (Hrithik Roshan)తో కలిసి ఈ సినిమాలో నటించింది.కానీ ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత దర్శకుడు మణిరత్నం (Maniratnam) ‘దిల్ సే’సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ఆ తర్వాత విమర్శలు ఎదుర్కొంది. ఇక తెలుగులో కూడా పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకొని ఇప్పుడు స్టార్ హోదాను దక్కించుకుంది.
ప్రీతి జింటా ఆస్తుల వివరాలు..
ప్రీతి జింటా ఆస్తుల వివరాల విషయానికి వస్తే.. లగ్జరీ కార్స్, సినిమాల ద్వారా వచ్చిన సంపాదన , రియల్ ఎస్టేట్, వాణిజ్య ప్రకటనలు ఇలా మొత్తం కలుపుకొని, సుమారుగా రూ.185 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈమె సిమ్లా లో జన్మించిన కారణంగా సొంత ఊరిలో కొంత ప్రాపర్టీని కొన్న ఈమె అలాగే ముంబై, లాస్ ఏంజెల్స్ లో కూడా స్థలాలు కొనుగోలు చేసింది. ఇక 2023లో ముంబైలోని పాళీ హిల్స్ ప్రాంతంలో దాదాపు రూ.17 కోట్లు ఖర్చుపెట్టి ఒక ప్రాపర్టీని కొనుగోలు చేసింది. అలాగే బాంద్రా లో కూడా రూ .8.2 కోట్ల విలువ గల అపార్ట్మెంట్ ఉన్నట్లు సమాచారం. అంతేకాదు పలు ప్రకటనలలో పనిచేస్తున్న ఈమె ఒక్కో ప్రకటన కోసం సుమారుగా రూ.1.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం.
ప్రీతి జింటా లగ్జరీ కార్లు..
ప్రీతి జింటా దగ్గర ఉన్న కార్ల విషయానికి వస్తే.. పోర్స్చే, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్, లెక్సస్ ఎల్ ఎక్స్ 470 క్రాస్ ఓవర్ వంటి లగ్జరీ కార్లు ఈయన సొంతం.
ఐపీఎల్ టీమ్ కొనుగోలు చేసిన ప్రీతి జింటా..
పంజాబ్ కింగ్స్ అనే ఐపీఎల్ టీమ్ ని దాదాపు రూ.350 కోట్ల పెట్టుబడితో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ఐపీఎల్ టీమ్ లో 23% వాటాన్ని కలిగి ఉంది ప్రీతిజింట.
ప్రీతి జింటా స్టూడియో..
అన్నిటికంటే ప్రత్యేకించి ఈమె ఒక స్టూడియోని కూడా కలిగి ఉంది. దీని విలువ సుమారుగా రూ.600 కోట్లని సమాచారం.