Gundeninda GudiGantalu Today episode January 31st: నిన్నటి ఎపిసోడ్ లో… శృతి టెన్త్ ఏసుకొని పడుకునిందని ఇంట్లో వాళ్ళని ఎలాగైనా అడిగి తెలుసుకోవాలని శోభ ప్రభావతి ఇంటికి వస్తుంది.. ప్రభావతి మీద చిందులేస్తుంది. కూతురుకి కనీసం రూమ్ కూడా ఇవ్వట్లేదని ఇదేనా మీరు చూసుకుని మర్యాద అని ఇదేనా మీరు చూసుకునే జాగ్రత్త అని ప్రభావతిని తిడుతుంది శోభ. ముగ్గురు కొడుకులు ఉన్నారు మరి మీ ఆయన లోన్ కట్టే కదా ఈ ఇల్లు కట్టించారు అదేదో ఇంకొక గది కట్టించొచ్చు కదా అనేసి శోభ అంటుంది. మీ ఆయన లోన్ కోసం మా ఆయన కాళ్ళ వేళ్ళ పడ్డాడు కాళ్ళు పట్టుకునే అంత పని చేశాడు ఆయన మీరు ఇలా చేస్తారని శోభ అంటుంది. అప్పుడే బయట బాలు వెయిట్ చేస్తుంటాడు. ఆ మాట అనగానే లోపలికి వస్తాడు. ఆ మాట వినగానే బాలు రెచ్చిపోతాడు ఇక శోభాని నోటికి వచ్చినట్లు అనేస్తాడు. మా నాన్న అనే హక్కు మీకు ఎవరిచ్చారు మీ కూతురు గురించి మీరు చూసుకోండి మా నాన్న మీ ఆయన కాళ్లు పట్టుకోవాలని చూశాడా ఏం మాట్లాడుతున్నారు ఏం ప్రభావతి నువ్వు ఇక్కడే ఉన్నావ్ కదా నీకు కనీసం కొంచెం కూడా నాన్నని అంటుంటే బాధగా అనిపించలేదా అని ప్రభావతికి శోభా కి పెద్ద పీకుతాడు బాలు.. శోభనం వలన మా నాన్నని ఎదవ అంటుంది కాళ్లు పట్టుకున్నాడు అంటుంది ఇన్ని మాటలు అన్న ప్రభావతి నీకు చీమకుట్టినట్టు కూడా లేదా ఇంకా నువ్వు మా నాన్న మీద చూపించే ప్రేమ ఇది.. ఇక సత్యం ఎంట్రీ ఇచ్చి శోభకు నచ్చ చెబుతాడు. శృతి శోభన్ తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్విషయానికొస్తే.. ఇక బాలు రాజేష్ దగ్గరికి వచ్చి నా తప్పు లేకపోయినా నన్నే క్షమాపణలు చెప్పమంటారు ఏంటని జరిగిందంతా బయట పెడతాడు. ఇక బార్ కి వెళ్ళాలని రెడీ అవుతారు. కార్తీక్ రాజేష్ బాలుల కన్వర్జేషన్ కామెడీగా ఉంటుంది. ఇక అందరూ కలిసి బార్ కి వెళ్తారు. బాలు ఎంత చెప్పినా మళ్ళీ నా తప్పేమీ లేదు కదా నాకు కోపం తెప్పించాల్సిన పని ఉంది అని అదే మాట దగ్గరకు తీసుకొస్తాడు. రాజేష్ వీడు మళ్ళీ మొదటికి వచ్చాడు టాపిక్ రాజేష్ వీడు మళ్ళీ మొదటికి వచ్చాడు టాపిక్ డ్రైవర్ట్ చెయ్యకపోతే అదే పనిలో ఉంటాడు. ఒక వ్యక్తి రాజేష్ చైర్ ని తగులుతాడు ఇక ఎన్నిసార్లు క్షమించమని అడుగుతాడు దానికి బాలు గొడవ పెట్టుకుంటాడు. ఆ తర్వాత నా తప్పు లేకపోయినా నన్ను క్షమించమని చెప్తారు ఏంట్రా ఇంట్లో భరించలేక ఎక్కడికి వచ్చాను అని బాలు అంటాడు. ఇక తర్వాత మరో వ్యక్తి నన్ను క్షమించు బంగారం అని తన భార్యతో మాట్లాడుతూ ఉంటాడు వాడి దగ్గరికి కూడా వెళ్లి నాలుగు దులిపేస్తాడు బాలు. రాజేష్ ఎందుకురా అందరి మీద కోప్పడతావ్ నీకు కోపం ఎక్కువ అనేసి అంటాడు. దానికి బాలు రాజేష్ ని కొడతాడు కోపం వచ్చింది కదా ఇప్పుడు నాకు అంత కోపం వస్తుంది అని అంటాడు.
బాలు ఇంటికి వెళ్ళిపోతాడు. మీనా ఉండటం చూసి షాక్ అవుతాడు.. మీనా కంట్లో పడకూడదు తాగిన విషయాన్ని అస్సలు బయట పెట్టకూడదు అని బాలు వెనక్కి తిరుగుతాడు. మీనా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. లోపలికి రండి అని అడుగుతుంది. ఏంటి తాగొచ్చారా ఇలా ఉంది మీ ఫేసు అనేసి అడగ్గానే బాలు నేను తాగక ఐదు రోజులైంది నీకు అలా కనిపిస్తున్నానా కావాలంటే ఏ టెస్ట్ అయినా పెట్టుకొని చాలెంజ్ చేస్తాడు. ఇక మీనా తన వేలుని చూపించి ఇది చాక్ పీస్ మీకు కనిపిస్తుందా అని అడిగితే కనిపించలేదు అంటే కచ్చితంగా తాగాను అనుకుంటుంది కనిపించింది అనేసి అంటాడు. ఒక లైన్ వేస్తాను ఆ లైన్ మీద మీరు తూలకుండా నడిచి చూపించండి అని బాలుతో ఉంటుంది. బాలు ఆ లైన్ మీద నడిచి చూపిస్తాడు. ఇక మీనా నేను అక్కడ లైనే వేయలేదు మీరు ఎలా నడిచి చూపించారు ఇలా తాగి వస్తే మామయ్య గారు ఫీల్ అవ్వరా అని క్లాసిక్ ఉంది. తింటారని అడుగుతుంది. చపాతి చేశాను అందరి కోసం నిల్చుని ఇంతసేపు చపాతి చేయాల్సి వచ్చింది . ఇంకా శృతి రవి కూడా రాలేదు. మీరు తినండి వాళ్ళకి కూడా పెడతాను అనేసి అంటుంది. నాకు కామ్లెట్ వేసి ఇవ్వు అనేసి బాలు అంటాడు అప్పుడే డోర్ కొడితే ప్రభావతి సత్యం వస్తారు.
తిన్నారా నాన్న అని బాలు అడుగుతాడు. తినేసే అలా వాకింగ్ కి వెళ్లి వచ్చాం రాని సత్యం అంటాడు. ఇక మళ్ళీ డోర్ కొట్టిన చప్పుడు వినిపిస్తే రవి శృతిలొచ్చారని మీనా తలుపు తీస్తుంది. రండి తిందురు రండి మీకోసం చపాతి రోటి పచ్చడి చేశాను నీకు ఇష్టం కదా రవి అని అంటుంది. సారీ మీనా మేం బయట తినొచ్చామని శృతి అనగానే బాలు ప్లేటును కింద పడేస్తాడు.. బాలుకి కోపం వస్తుంది. తినే ప్లేట్ ను కింద పడేసి, ఆలుమగలు ఇష్టం ఉన్నట్లు బయట బలాదూర్ గా తిరిగివచ్చి, బయటనే తిని వచ్చామని చెబితే ఎలా? మీ కోసం మీనా కష్టపడి చపాతీలు చేసింది. ఇప్పుడు ఆ చపాతీలు తినాల్సిందేనని బాలు పట్టుపడతాడు.. తాను బయట తిని వచ్చామని, ఆ విషయాన్ని ముందుగా చెప్పకపోవడం తన తప్పేనని రవి సారీ చెబుతాడు. కానీ, బాలు పట్టించుకోడు. రవిని లాక్కొచ్చి నోట్లో చపాతీలను కుక్కుతాడు. దీంతో శృతికి ఎక్కలేని కోపం వస్తుంది. బుద్ధి లేదా అంటూ బాలుని నానా మాటలు అంటుంది. దీంతో బాలు రివర్స్ అవుతాడు. లేచిపోయిన వాళ్ళు బుద్ధి గురించి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నిస్తాడు. దీంతో శ్రుతి రియాక్ట్ అవుతూ.. తాము బయట తినొచ్చామని చెప్తున్నా కదా.. పాడైతే డస్ట్ బిన్ లో పాడేయండి .. కానీ బలవంతంగా నోట్లో కుక్కుతారా ? అంటూ పొగరుగా సమాధానం ఇస్తుంది..
మనోజ్ రోహిణి కిందకు వస్తారు ఏంట్రా రోజు ఇది డిస్టబెన్స్ అని మనోజ్ అనగానే బాలు కోపంతో రగిలిపోతాడు. నీ రూమ్ ముందు రేపు స్పీకర్ పెట్టుకుని ఇంగ్లీష్ పాటలు పెట్టుకొని పడుకుంటానని బాలు వార్నింగ్ ఇస్తాడు ఇక రోహిణి పోనీలే బాలు ఈరోజు వదిలేయి రేపటి నుంచి వాళ్ళు ఇక్కడే తింటారులే అనేసి అంటుంది.. శృతి రవి వెళ్లిపోతుంటే బాలు రవిని ఆపి నోట్లో బలవంతంగా కుక్కుతాడు. శృతికి నచ్చజెప్పి ప్రయత్నం చేయకుండా.. మాకు ఇది రోజు అలవాటయింది. బాలు తాగి వస్తే.. ఇలానే గొడవ చేస్తాడు అంటుంది శ్రుతి. ఈ విషయం ఆల్రెడీ తనకు రవి చెప్పాడని, బాలు రోజు పీకలదాకా తాగి వచ్చి ఇంట్లో కూడా వచ్చేస్తాడని, ఇల్లును వారి జోన్ గా మార్చాలని రవి చెప్పాడని శృతి అంటుంది. ఏరా ఇంటికి వచ్చే ముందే నీ పెళ్ళానికి అన్ని విషయాలు చెప్పావా.. నేను మాత్రమే తాగుతానని చెప్తావా.. మనం నీ బర్త్ డే నాడు దాబాపై తాగిన విషయాన్ని నీ పెళ్ళాన్ని చెప్పలేదా? అని బర్త్ డే పార్టీ గురించి బయటపెడతాడు బాలు.. ఇక మనోజ్, రవి కూడా తాగుతారా అని ప్రశ్నిస్తుంది ప్రభావతి. ఒక్కొక్కడు మూడు- నాలుగు బీర్లు తాగుతారనీ, ఆ రోజు కాటన్ బీర్లు తాగేశారని అని బాలు అసలు విషయాన్ని బయటపెడుతాడు. దీంతో తమను తాము కవర్ చేసుకోవడానికి అటు మనోజ్.. ఇటు రవి తిప్పలు పడుతారు. ఏదో బర్త్డే నాడు జోష్ లో తాగానని రవి చెప్పగా.. మనోజ్ మాత్రం తనని బలవంతం చేసి తాగిపించారని అంటాడు.. మొత్తానికి అందరూ కొడుకులు తాగే వాళ్ళని ప్రభావతి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..