Indian Railway Coaches Code Meaning: భారతీయ రైల్వే సంస్థ నిత్యం వేలాది రైళ్లను నడుపుతుంది. కోట్లాది మంది ప్రయాణీకులు రైళ్ల ద్వారా తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు. అయితే, రైలు ప్రయాణం చేసే సమయంలో ఒక్కో బోగీ మీద ఒక్కో పదం రాసి ఉంటుంది. ఉదాహారణకు కొన్ని కోచ్ ల మీద D, కొన్ని కోచ్ ల మీద C, మరికొన్ని కోచ్ ల మీద A, B, E, H, HA, S రాసి దాని కింద ఓ నెంబర్ వేస్తారు. ఇంతకీ ఇలా ఎందుకు రాస్తారు? ఆ పదాల వెనుక ఉన్న ఆర్థం ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
క్లాసుల వారీగా కోచ్ లకు కోడ్
రైల్లోని ఏ కోచ్ ఏ క్లాస్ కు సంబంధించినదో చెప్పేందుకు ఈ పదాలను వాడుతారు. ఇంతకీ ఏ పదం ఏ కోచ్ ను సూచిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం..
⦿ GN: GN అంటే జనరల్ బోగీ. ఇందులో ఎవరైనా రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు రైల్వే స్టేషన్ కౌంటర్ లో టికెట్ తీసుకుని ఎక్కవచ్చు. అయితే, సీటు దొరుకుతుందనే గ్యారెంటీ లేదు.
⦿ D: ఏదైనా కోచ్ మీద D1, D2, D3 వేసి ఉంటే నాన్ ఏసీ కోచ్ గా భావించాలి. ఈ టికెట్లను కూడా రిజర్వేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే, సీటు గ్యారంటీగా లభిస్తుంది.
⦿ C: ఇక ఏదైనా కోచ్ మీద C1, C2, C3 వేసి ఉంటే, అది ఏసీ చైర్ కార్ బోగీగా గుర్తించాలి. టికెట్లు రిజర్వేషన్ చేయించుకుని ఇందులో కూర్చొని ప్రయాణించే అవకాశం ఉంటుంది.
⦿ E: బోగీ మీద E1, E2, E3 అని ఉంటే.. అది ఎగ్జిక్యుటికవ్ ఏసీ చైర్ కార్ కోచ్ గా గుర్తించాలి. ఇది కాస్త లగ్జరీగా ఉంటుంది.
⦿ S: ఇక S1, S2, S3 అని బోగీల మీద ఉంటే స్లీపర్ క్లాసులుగా గుర్తించాలి. ఇందులో ప్రయాణ సమయంలో పడుకునే అవకాశం ఉంటుంది.
⦿ B: B1, B2, B3 అని బోగీల మీద రాసి ఉంటే థర్డ్ ఏసీ కోచ్ గా గుర్తించాలి.
⦿ A: ఇక A1, A2, A3 ఉంటే సెకెండ్ ఏసీ కోచ్ లు గా తెలుసుకోవాలి.
⦿ H: ఇక ఫస్ట్ ఏసీ కోచ్ లకు H1, H2, H3, HA1m HA2, HA 3 అని రాసి ఉంటుంది. ఈ బోగీలలో ప్రైవేట్ క్యాబిన్లు కూడా ఉంటాయి. లగ్జరీ ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ప్రయాణీకులు సింఫుల్ గా తాము ప్రయాణించే కోచ్ ఏదో గుర్తించేందుకు వీలుగా రైల్వేశాఖ ఈ కోడ్ లను ఏర్పాటు చేసింది.
Read Also: ఆ రాష్ట్రంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్, అక్కడికి వెళ్లాలంటే తల ప్రాణం తోకకు రావాల్సిందే!
Read Also: మీ ట్రైన్ టికెట్ పోయిందా? కంగారు పడకండి.. సింఫుల్ గా డూప్లికేట్ టికెట్ పొందండిలా!