SSMB29 Update..సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheshbabu), రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో వస్తున్న భారీ ప్రాజెక్టు చిత్రం ఎస్ ఎస్. ఎమ్. బి 29 (SSMB 29) ఇప్పటికే ఇందులో హాలీవుడ్ ఐకాన్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) భాగమైన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం అభిమానులే కాదు యావత్ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే హైదరాబాదులో షూటింగ్ ప్రారంభం కాగా.. అందులో భాగంగానే ఇండోర్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఒడిస్సాలో అవుట్డోర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈవారం ఆఖరిలో ఒరిస్సాలోని కొన్ని సెలెక్టివ్ ప్రాంతాలలో షూటింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.
SSMB -29 మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్..
ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మరి ఆయన పెట్టిన పోస్ట్ కి, ఈ సినిమాకు సంబంధం ఏంటో.. ఆయన పెట్టిన పోస్టులో ఏముందో.. ఇప్పుడు చూద్దాం. పృథ్వీరాజ్ సుకుమారన్ తన పోస్టులో..” దర్శకుడిగా నా చేతిలోని సినిమాలన్నీ పూర్తి చేశాను. వాటికి సంబంధించిన మార్కెటింగ్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఇక నటుడిగా నేను తెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నాను. పరభాష చిత్రంలో కనిపించనున్నాను. కానీ అందులో పెద్ద పెద్ద డైలాగులు ఉన్నాయని తెలిసి, కాస్త భయపడుతున్నాను” అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఇది చూసిన చాలామంది పృథ్వీరాజ్ ఈ పోస్ట్ ఎస్ఎస్ఎంబి 29 గురించే పెట్టాడని అందరూ కామెంట్లు చేస్తున్నారు. అసలే కొద్దిరోజులుగా పృథ్వీరాజ్ ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్న సమయంలోనే అలాంటి పోస్ట్ పెట్టి హింట్ ఇచ్చాడని అందరూ చర్చించుకుంటూ ఉండటం గమనార్హం. ఏది ఏమైనా ఈ సినిమాలో పృథ్వీరాజ్ నటించబోతున్నాడు అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ Sardar 2: షూటింగ్లో గాయపడ్డ హీరో.. హుటాహుటిన హాస్పిటల్ కి తరలింపు..!
పృథ్వీరాజ్ సుకుమారన్ కెరియర్..
పృథ్వీరాజ్ సుకుమారన్ విషయానికి వస్తే.. మలయాళ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, నేపథ్య గాయకుడిగా కూడా పేరు దక్కించుకున్నారు. మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ భాషా చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 2002లో మలయాళ సినిమా ‘నందనం’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేశాడు. ఇక 2006లో ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఈయన 1982 అక్టోబర్ 16న కేరళ తిరువనంతపురంలో మల్లికా సుకుమారన్ (Mallika Sukumaran), నటుడు సుకుమారన్ (Sukumaran) దంపతులకు జన్మించారు. ఇక 2011 ఏప్రిల్ 25న బీబీసీ ఇండియా టీవీ ప్రతినిధి సుప్రియ మీనన్ (Supriya Menon) వివాహం చేసుకున్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు దర్శకుడిగా కూడా భారీ పాపులారిటీ అందుకున్నారు. ఇక 2023లో సలార్ పార్ట్ వన్ (Salaar -1) లో నటించిన సుకుమార్ 2024లో ‘బడే మియా చోటే మియా’ అనే సినిమాలో కూడా నటించారు.