The Paradise Glimpse: కేవలం ఫీల్ గుడ్ సినిమాల్లో మాత్రమే నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయిన హీరోలు చాలా తక్కువమంది ఉంటారు. తెలుగులో అలాంటి హీరో ఎవరంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చే పేరు నాని. నేచురల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఈ హీరో ఇప్పుడు రూటు మార్చాడు. వైలెంట్ కథలను ఎంచుకుంటున్నాడు, మాజ్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. తాజాగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ మూవీకి సంబంధించిన గ్లింప్స్ విడుదలయ్యింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ఒకేసారి ఈ గ్లింప్స్ ప్రేక్షకుల ముందుకు రాగా.. మలయాళంలో ఇది పెద్ద కాంట్రవర్సీనే క్రియేట్ చేసింది.
అన్ని భాషల్లో ఒకేసారి
శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela), నాని (Nani) కాంబినేషన్‌లో ఇప్పటికే ‘దసరా’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కోసం మొదటిసారి ఊర మాస్ అవతార్‌లో కనిపించాడు నాని. ఇక ఇదే కాంబినేషన్‌లో మరో సినిమా అంటే అదే రేంజ్‌లో మాస్‌గా ఉంటుందని ఆడియన్స్ ముందే గెస్ చేశారు. కానీ ‘ది ప్యారడైజ్’ (The Paradise) గ్లింప్స్ విడుదలయిన తర్వాత అది చూసిన ప్రతీ ఒక్కరు షాక్ అవ్వక తప్పడం లేదు. గ్లింప్స్‌లో డైలాగులు, అందులో బూతులు చూసి అది అసలు నాని సినిమానేనా అని అనుకున్నారు. తెలుగులో మాత్రమే కాదు.. అన్ని భాషల్లో విడుదలయిన గ్లింప్స్‌లో కూడా ఈ బుతూలు ఉండగా.. అది మలయాళ ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు.
మార్కెట్‌పై ఎఫెక్ట్
‘ది ప్యారడైజ్’ తెలుగు గ్లింప్స్‌లో ఉన్న బూతు పదాన్నే ఉన్నది ఉన్నట్టుగా మలయాళంలోకి మార్చారు మేకర్స్. కానీ ఆ పదం అక్కడి ప్రేక్షకులకు నచ్చలేదు. అసలు ఆ బూతులు ఏంటి, ఆ గ్లింప్స్ ఏంటి అంటూ ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్‌పై నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. దీంతో గ్లింప్స్‌కే ఈ రేంజ్‌లో నెగిటివిటీ వస్తే.. సినిమాపై మరెంత నెగిటివిటీ వస్తుందో అని నాని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇలాగే కొనసాగితే మాలీవుడ్‌లో నాని మార్కెట్‌పై ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నేచురల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నానికి తెలుగుతో పాటు ఇతర సౌత్ భాషల మార్కెట్ కూడా ముఖ్యమే. ఇప్పటికీ ఈ కాంట్రవర్సీపై, గ్లింప్స్‌పై వస్తున్న నెగిటివిటీపై మేకర్స్ స్పందించలేదు.
Also Read: ఆ సినిమాలు ఎందుకు చేశానా అని ఫీల్ అవుతున్నా.. సమంత కామెంట్స్
ఎన్నో సందేహాలు
‘ది ప్యారడైజ్’ మూవీ 2026 మార్చి 26న విడుదల అవుతుందని గ్లింప్స్‌తో పాటు రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమా గ్లింప్స్ విడుదల అయినప్పటి నుండి పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా ప్రేక్షకులు మాత్రం దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ సినిమా దేని గురించి, నాని ఈ గెటప్‌లో ఎందుకు ఉన్నాడు.. ఇలాంటి ఎన్నో సందేహాలు అందరిలో మొదలయిపోయాయి. ఈ సందేహాలకు సమాధానం కావాలంటే వచ్చే ఏడాది మార్చి వరకు ఆగాల్సిందే. ఇక ‘ది ప్యారడైజ్’ కంటే ముందు ఒక భయం లేని పోలీస్ ఆఫీసర్ పాత్రతో ‘హిట్ 3’ సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్నాడు నాని.
#TheParadise What is this Malayalam Dubbing 😨 & The Tattoo In The Hand 😨#TheParadiseGlimpse #Nani pic.twitter.com/gWBruLBJM2
— Kerala Box Office (@KeralaBxOffce) March 3, 2025