Tollywood:బ్రహ్మ ఆనందం (Brahma Anandam).. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం (Brahmanandam)తన పెద్ద కుమారుడు గౌతమ్ రాజా(Gautam Raja) తో కలసి నటించిన చిత్రం ఇది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాత మనవడుగా ఈ సినిమాలో బ్రహ్మానందం, గౌతమ్ రాజా ఒదిగిపోయి మరీ నటించారు. ఇక చాలా కాలం తర్వాత మళ్లీ ఒకే సినిమాలో కనిపించడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రియా వడ్లమాని. ఒక సినిమా విజయం సాధించడంతో పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ఈమె.. అందులో భాగంగానే నేషనల్ అవార్డు అందుకున్న సినిమాని మిస్ చేసుకొని తన కెరీర్ లో చేసిన అతిపెద్ద తప్పు అదే అంటూ చెప్పుకొచ్చింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
కలర్ ఫోటో సినిమాలో అలా అవకాశం మిస్ అయింది..
ఆ సినిమా ఏదో కాదు కలర్ ఫోటో (Colour Photo). జాతీయ అవార్డ్ గెలుచుకున్న ఈ సినిమా.. 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డు అందుకుంది. ఇందులో సుహాస్ (Suhas) పాటు చాందిని చౌదరి (Chandini Choudhary) హీరో, హీరోయిన్లుగా నటించారు. అయితే మొదట చాందినీకి బదులు ప్రియా వడ్లమాని (Priya Vadlamani)కి హీరోయిన్ గా అవకాశం లభించిందట.
కానీ ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో చాందినినీ రంగంలోకి దింపినట్లు సమాచారం. ఇక ఇదే విషయంపై ప్రియా వడ్లమాని మాట్లాడుతూ.. “2015లో నా సినిమా జర్నీ మొదలైంది. ఫేస్ బుక్ ద్వారా నాకు కొన్ని సినిమా ఆఫర్లు వచ్చాయి. వాళ్ళు పదేపదే అడిగేసరికి ఓకే చెప్పాను. ఆడిషన్ అయ్యింది. సినిమా కూడా చేశాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత ప్రేమకు రెయిన్ చెక్, శుభలేఖలు, హుషారు వంటి సినిమాలు కూడా ఒకేసారి షూటింగ్ జరిగాయి. ఇక హుషారులో “ఉండిపోరాదే” పాట అంత పెద్ద హిట్ అవుతుంది అని కూడా నేను అనుకోలేదు. ఇక ఆ తర్వాతే నాకు కలర్ ఫోటో సినిమాలో అవకాశం లభించింది. అయితే పెద్దగా సినిమా నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఏది సరైన ప్రాజెక్టు అన్న ఆలోచన నాకు తట్టలేదు. అందుకే సినిమా పరిజ్ఞానం లేకపోవడం వల్లే గైడెన్స్ ఇచ్చేవారు లేక చాలా ప్రాజెక్టులు వదులుకున్నాను.
Mrunal Thakur: డెకాయిట్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మృణాల్..!
ఇప్పటికీ బాధగానే ఉంటుంది..
ముఖ్యంగా నాకు ఏదైనా సినిమా ఆఫర్ వస్తే.. మా అమ్మ నాన్నతో కలిసి నిర్ణయం తీసుకునే దాన్ని.. ఆ సమయంలో ఏమైందంటే నాకు కొంచెం సమయం కావాలని చెప్పాను. ముందుగా పల్లెటూరు అమ్మాయి పాత్రలో చేయాలి కాబట్టి నేను సెట్ కానేమో అని వాళ్ళు కాస్త డౌట్ పడ్డారు. అలా అవకాశాన్ని కోల్పోయాను. అలా అవకాశం మిస్ అయింది. ఇంత మంచి అవకాశాన్ని వదులుకున్నానని, ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాను” అంటూ ప్రియా వడ్లమాని చెప్పుకొచ్చింది. ఇక ఈమె ఒక చిత్రం, ఓం భీమ్ బుష్, వీరాంజనేయులు, విహారయాత్ర, బ్రహ్మ ఆనందం వంటి చిత్రాలలో నటించింది.