Priyadarshi : టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బలగం సినిమాతో హీరోగా మారిన ప్రియదర్శి ఆ తర్వాత వరుసగా హీరోగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు.. రీసెంట్ గా వచ్చిన సారంగపాణి జాతకం మూవీ ప్రేక్షకులను మెప్పించింది. ఒక్క సక్సెస్ అతడి జీవితాన్నే మార్చేసింది. నాటి నుంచి నేటి వరకూ ప్రియదర్శి ఖాళీగా ఉన్న రోజు లేదు. నటుడిగా అంత బిజీ అయ్యాడు. అతడు నటించిన సినిమాలు ఏడాదికి నాలుగైదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు..అయితే ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. ఆ మూవీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
బాలీవుడ్ లోకి ప్రియదర్శి..
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు ప్రియదర్శి.. యంగ్ హీరోల సినిమాల్లో నటించి ఇండస్ట్రీలకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్నారు. మల్లేషం మూవీతో హీరోగానూ టర్న్ అయ్యాడు. ఇటీవలే కోర్టు తో మంచి బ్రేక్ అందుకున్నాడు. ఈ సినిమా భారీ లాభాలు తెచ్చి పెట్టింది. నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కాడు. ఆ వెంటనే సారంగపాణి జాతకం అంటూ మరో హిట్ సినిమాను తన అకౌంట్ లోకి వేసుకున్నాడు. సినిమాలపరంగా బాగా సక్సెస్ అయిన ప్రియదర్శి ఇప్పుడు తెలుగులో పాటు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు హీరోగా సుజిత్ సర్కార్ ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీలో హీరోలు ఇద్దరు అట. అందులో ఒకరు ప్రియదర్శి అని టాక్. ఇప్పటికీ ప్రియదర్శితో బాలీవుడ్ మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం.. ప్రియదర్శ్ ఇంతవరకూ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇది మంచి అవకాశమే. నటుడిగా అతడి ఇమేజ్ బాలీవుడ్ పాకుతుంది.. హిందీ సినిమా అయినా కూడా తెలుగులో అతనికి ఉన్న క్రేజ్ వల్ల తెలుగులో మంచి సక్సెస్ ని అందుకునే అవకాశం కూడా ఉండడంతో ప్రియదర్శి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే వార్త కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. త్వరలోనే ఈ మూవీ గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం..
ఇక ప్రియదర్శి సినిమాలు విషయానికి వస్తే.. ఏడాదికి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బలగం సినిమా తర్వాత ఈయనకు పట్టిందల్లా బంగారమే అయిపోతుంది. ఏ సినిమా చేసిన కూడా మంచి టాక్ ని సొంతం చేసుకుంటుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలు ప్రేక్షకులను బాగానే మెప్పించాయి. తెలుగులో మంచి సక్సెస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో గనక బిజీ అయితే ఇక ఈయనకు తిరుగులేదు.. చూద్దాం తమిళ సినిమాల్లో కూడా నటిస్తాడేమో.. ఏది ఏమైనా కూడా కమెడియన్ నుంచి హీరోగా మారి వరుస సక్సెస్ ని అందుకోవడం మామూలు విషయం కాదు..