BigTV English

Priyanka Chopra visit Ayodhya’s Ram Mandir: అయోధ్య రాముడిని దర్శించుకున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా

Priyanka Chopra visit Ayodhya’s Ram Mandir: అయోధ్య రాముడిని దర్శించుకున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా
Priyanka Chopra visit Ayodhya's Ram Mandir
Priyanka Chopra visit Ayodhya’s Ram Mandir

Priyanka Chopra visit Ayodhya’s Ram Mandir (today news telugu): బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ ఇలా అంచలంచలుగా ఎదుగుతూ ప్రస్తుతం హాలీవుడ్ లో సెటిల్ అయిన భారత నటి ఎవరంటే ముందుగా ప్రియాంక చోప్రా పేరే గుర్తొస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీని వదిలి హాలీవుడ్ లో సెటిల్ అయిన ఈ భామ ప్రపంచ వ్యాప్తంగా పలు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దేశ సినీ చరిత్రలో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనే తేడా లేకుండా గ్లోబల్ స్టార్ గా ఎదిగింది. హాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడంతో ప్రియాంక పూర్తిగా హాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. అంతేకాదు లాస్ ఎంజెల్స్ లో వందల కోట్లతో ఇళ్లు కొనుక్కుని అక్కడే మకాం వేసింది. ఈ క్రమంలో అప్పుడప్పుడు ఇండియాకు వస్తూ పోతూ ఉంటుంది. హాలీవుడ్ లో సెటిల్ అయినా.. తాను పుట్టిపెరిగిన దేశంలో జరిగే ఏ ఈవెంట్లో అయినా పాల్గొనేందుకు ప్రియాంక ఆసక్తి కనబరుస్తుంది. తాజాగా తన భర్త నిక్ జోనస్ తో కలిసి ప్రియాంక చోప్రా ఇండియాకి వచ్చింది.


ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య రామజన్మభూమిలో కొలువుదీరిన అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తన ఫ్యామిలితో కలిసి వచ్చింది. బుధవారం ఉదయం తన భర్త నిక్ జోనస్, తన కూతురు మల్టీమారితో కలిసి అయోధ్య బాలక్ రామ్ ను దర్శించుకుంది ప్రియాంక చోప్రా. ఈ క్రమంలో భారీ భద్రత నడుమ అయోధ్య ఎయిర్ పోర్టులో తమ కారు వద్ద ప్రియాంక తన భర్త కూతురితో కలిసి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంప్రదాయ దుస్తులను ధరించి అయోధ్య రాముడిని ప్రియాంక చోప్రా దర్శించుకుంది. పసుపురంగు చీరలో ఉన్న ప్రియాంక, తన కూతురు మల్టీని తన భుజాలపై ఎత్తుకుని కనిపించింది. గులాబీ రంగు దుస్తుల్లో ఉన్న తన కూతురిని ఎత్తుకుంది. సంప్రదాయ దుస్తుల్లో ఒకటైన కుర్తాను ప్రియాంక భర్త నిక్ ధరించి ఆలయాన్ని సందర్శించారు.


కాగా, జనవరి 22వ తేదీన అయోధ్య మందిరాన్ని ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మహత్కార్యానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు విచ్చేశారు. అందులో బాలీవుడ్ ప్రముఖ నటులు కూడా పాల్గొన్నారు. అమితాబచ్చన్, అభిషేక్ బచ్చన్, నటి కంగనా రనౌత్, ప్రముఖ వ్యాపార వేత్త ముకేష్ అంబానీ కుటుంబంతో సహా అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్టలో పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో రాలేకపోయిన ప్రియాంకచోప్రా.. తాజాగా నేడు రాముడిని దర్శించుకున్నారు.

 

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×