BigTV English

Ilayaraja Biopic: ఇళయరాజాకు నేనొక భక్తుడిని.. నాకు గురువు ఆయన: ధనుష్‌

Ilayaraja Biopic: ఇళయరాజాకు నేనొక భక్తుడిని.. నాకు గురువు ఆయన: ధనుష్‌

Ilayaraja Biopic


Ilayaraja Biopic (celebrity news today): ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి కీలకు ఆప్ డేట్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. చెన్నైలోని లీలా ప్యాలెస్ లో బుధవారం నిర్వహించిన వేడుకల్లో విశ్వ నటుడు కమల్ హాసన్, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, హీరో ధనుష్ పాల్గొన్నారు.

బుధవారం నుంచి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడంతో మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. కమల్ హాసన్, ఇళయరాజా, ధనుష్ ల చేతుల మీదగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇళయరాజా బయోపిల్ లో నటించాలని తాను ఆలోచిస్తూ తాను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని ధనుష్ వెల్లడించారు. ఈ సందర్భంతా ఇళయరాజాతో తనకి ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని తెలియజేశారు. ఇళయరాజా తనకు గురువు అని ధనుష్ వెల్లడించారు.


నీ ఆలోచనలో నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఇళయరాజా ఎప్పుడు చెప్తుండేవారని ధనుష్ అన్నారు. చాలా మంది ప్రతిరోజూ నిద్రపోయే ముందు ఇళయరాజా పాటలు వింటుంటారని.. కానీ, తాను మాత్రం ఆయన బయోపిక్ లో నటించాలని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినట్లు తెలిపారు. నాకు రజనీకాంత్, ఇళయరాజా ఇంటే చాలా ఇష్టంమని.. వాళ్ల బయోపిక్స్ లో నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇళయరాజా బయోపిక్ లో నటించడం వల్ల ఓ కల నెరవేరిందన్నారు. ఇళయరాజాకు తానో భక్తుడిని అని అన్నారు. యాక్టింగ్ లో తనకి ఆయన సంగీతమే గురువు అని, ప్రతీ సీన్ కు ముందు ఆయన మ్యూజిక్ వింటే.. అదే ఎలా నటించాలో నేర్పుతుందని ధనుష్ తెలిపారు. ఈ సినిమా చిత్రీకరణలో ఎలాంటి ఒత్తిడికిలోను కాకుండా అద్భుతంగా తీర్చిదిద్దాలని కమల్ హాసన్ కోరారు.

Also Read: Ram Charan New Movie: రామ్ చరణ్ కొత్త మూవీ ప్రారంభం.. టైటిల్ ఇదేనా..!

ఇటీవలే ధనుష్ నటించిన “కెప్టెన్ మిల్లర్” చిత్రాన్ని తెరకెక్కించిన అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రాన్ని 2025లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృదం ప్రకటించింది. అయితే ఈ చిత్రానికి ఇళయరాజానే సంగీతం అందిచనున్నటు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కానీ చిత్ర బృదం దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటనా చేయలేదు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×