BigTV English

Mahesh Babu: మహేష్ తో ఆ సినిమా చేసి తప్పు చేశా.. ఇప్పుడు బాధపడి లాభమేంటీ !

Mahesh Babu: మహేష్ తో ఆ సినిమా చేసి తప్పు చేశా.. ఇప్పుడు బాధపడి లాభమేంటీ !

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) బాల నటుడుగానే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం రాజ కుమారుడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు. ఇక ప్రస్తుతం ఈయన రాజమౌళి(Rajamouli) డైరెక్షన్ లో పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఒక అడ్వెంచరస్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.


ఏకంగా నాలుగు సినిమాలు…

మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లతో ప్రొడ్యూసర్లతో సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఇలా మహేష్ బాబుతో ఏకంగా నాలుగు సినిమాలు చేసిన నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara) తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈయన సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇలా తన బ్యానర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక అనిల్ సుంకర తన నిర్మాణ సంస్థలో మహేష్ బాబుతో కలిసి ఏకంగా నాలుగు సినిమాలు చేశారు.


నాని చేయాల్సిన సినిమా..

ఇలా అనిల్ సుంకర మహేష్ బాబు కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలలో1 నేనొక్కడినే, దూకుడు, ఆగడు, సరిలేరు నీకెవరు వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ సినిమాలలో మహేష్ బాబుతో ఒక సినిమా చేసి తాను తప్పు చేశాను అంటూ తాజాగా అనిల్ సుంకర చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన1 నేనొక్కడినే(1 Nenokkadine) సినిమా మహేష్ బాబుతో చేయాల్సిన సినిమా కాదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో కాకుండా నాని (Nani)లాంటి హీరోతో చేసుంటే మంచిగా వర్క్ అవుట్ అయ్యేదని తెలిపారు.

విడుదలకు ముందే రిజల్ట్ తెలిసిపోయింది..

సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమాని తాను చూశాను. అయితే సినిమా అంతా బాగుంది కానీ ఎక్కడో ఏదో తేడాగా ఉందనేది మాత్రం స్పష్టంగా అర్థమైంది. ఈ సినిమా మహేష్ బాబు రేంజ్ సినిమా కాదని, విడుదలకు ముందే తనకు తెలిసిపోయిందని అనిల్ సుంకర ఈ సందర్భంగా మహేష్ బాబు సినిమా గురించి తెలిపారు. అదేవిధంగా ఆగడు, దూకుడు, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమా విశేషాలను కూడా పంచుకున్నారు. దూకుడు సినిమా కేవలం ఫస్ట్ ఒక లైన్ చెప్పగానే మహేష్ బాబు సినిమాకు కమిట్ అయ్యారు ఇక ఫస్ట్ హాఫ్ షూటింగ్ చేసిన తర్వాత సెకండ్ హాఫ్ ఆయనకు వివరించినట్లు అనిల్ సుంకర తెలిపారు. ఏది ఏమైనా మహేష్ బాబుతో సినిమా చేయటం గురించి నిర్మాత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×