Bunny Vasu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందిన వారిలో గీత ఆర్ట్స్ బ్యానర్ (Geetha Arts Banner)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇప్పటికే గీత ఆర్ట్స్ నుంచి ఎన్నో విభిన్నమైన సరికొత్త చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.. ఇక గీత ఆర్ట్స్ బ్యానర్ మాత్రమే కాకుండా, గీత ఆర్ట్స్ బ్యానర్ 2 స్థాపించి ఈ బ్యానర్ నుంచి కూడా కొత్త సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే గీత ఆర్ట్స్ 2 బ్యానర్ ను మరొక నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu) చూసుకుంటున్న విషయం మనకు తెలిసిందే.
గీత దాటే ప్రసక్తి లేదు…
ఇక గీత ఆర్ట్స్ 2 బ్యానర్ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలను బన్నీ వాసు ప్రేక్షకులకు పరిచయం చేశారు అయితే ఇటీవల కాలంలో బన్నీ వాసు గురించి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అల్లు అరవింద్ తో గొడవలు కారణంగా బన్నీ వాస్త గీత ఆర్ట్స్ నుంచి బయటకు వచ్చారని అందుకే ఈయన బీవి వర్క్స్ (B.V.Works)అనే కొత్త బ్యానర్ ప్రకటించారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో బన్నీ వాసు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈ వార్తలను పూర్తిగా ఖండించారు.
నాకు తల్లితో సమానం…
ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ.. గీత ఆర్ట్స్ అనేది నాకు నా తల్లితో సమానం. నాకు ఎంతో మంచి లైఫ్ ఇచ్చింది గీత ఆర్ట్స్ బ్యానర్ అని తెలిపారు. నేనెప్పుడూ కూడా గీత దాటి బయటకు వచ్చే ప్రసక్తి లేదని క్లారిటీ ఇచ్చారు. మరి తాను బీవి వర్క్స్ ప్రకటించడానికి కారణం లేకపోలేదని తెలిపారు. నాకు పరిచయమైన వారికోసం వారిని సపోర్ట్ చేయడం కోసమే నేను ఇది ప్రారంభించానని తెలిపారు. ఒకప్పుడు నాకు ఒకరు హెల్ప్ చేయటం వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. అదేవిధంగా నేను కూడా కొంతమందికి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతోనే బీవి వర్క్స్ ప్రారంభించామని తెలిపారు. అయితే ఈ విషయం అల్లు అరవింద్ బన్నీతో మాట్లాడిన తర్వాతనే ప్రకటించినట్లు బన్నీ వాసు తెలిపారు.
ఇక నేను ఈ కొత్త బ్యానర్ గురించి ప్రకటించడంతో చాలామంది అల్లు అరవింద్ గారితో గొడవ అయిందని వార్తలను సృష్టించారు కానీ అలాంటిదేమీ లేదని తెలిపారు. ప్రతిరోజు ఉదయం అల్లు అరవింద్ గారిని కలుస్తానని ఆయన చేత రెండు తిట్లు తినందే నాకు రోజు గడవదని తెలిపారు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం అల్లు అరవింద్ గారు, గీత ఆర్ట్స్ అంటూ మరోసారి బన్నీ వాసు క్లారిటీ ఇచ్చారు. అయితే గతంలో కూడా ఇలా గీత దాటుతున్న బన్నీ వాసు అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం సరికొత్త ప్రొడక్షన్ ప్రకటిస్తూ కొత్త అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉండండి అని ప్రకటించడంతో కచ్చితంగా గీత ఆర్ట్స్ వారితో విభేదాలు వచ్చాయని అందుకే బయటకు వచ్చారని అందరూ భావించారు. కానీ ఇది నిజం కాదు అంటూ బన్నీ వాసు క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఈయన అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా పనులలో బిజీగా గడుపుతున్నట్లు కూడా తెలియజేశారు. ఈ సినిమా గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఆ విషయాలు తాను చెప్పకూడదని అగ్రిమెంట్ ఉందని ప్రశ్న దాటవేశారు.