Benefits Of Meditation: ప్రస్తుతం ప్రతి ఒక్కరూ హడావిడి , ఒత్తిడితో పోరాడుతున్నారు. మానసిక అశాంతి, పని ఒత్తిడి, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు మన ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒత్తిడి మనస్సును ప్రభావితం చేయడమే కాకుండా శరీరాన్ని తీవ్రమైన వ్యాధుల వైపు నెట్టివేస్తుంది. ఇలాంటి పరిస్థితిలో, ధ్యానం అనేది ఒత్తిడిని తగ్గించడమే కాకుండా అనేక తీవ్రమైన వ్యాధులలో ఉపశమనం కలిగించే పరిష్కారంగా పనిచేస్తుంది.
ధ్యానం ఎందుకు ముఖ్యం
ధ్యానం అనేది సహజమైన, ప్రభావవంతమైన చికిత్స. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది మానసిక ప్రశాంతతను అలాగే శరీర సమతుల్యతను కాపాడుతుంది. మీరు కూడా ప్రతి రోజు ధ్యానం చేస్తే.. మీలో పెద్ద మార్పును చూస్తారు. ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. మానసిక ఆరోగ్య రుగ్మత:
ధ్యానం నిరాశ, ఆందోళన, భయాందోళనలు వంటి మానసిక రుగ్మతలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది మెదడులో ‘మంచి అనుభూతి’ హార్మోన్లు డోపమైన్ , సెరోటోనిన్ స్థాయిని పెంచుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మానసిక ప్రశాంతతను అందిస్తుంది.
2. అధిక రక్తపోటు:
క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల రక్తపోటు సహజంగా నియంత్రించబడుతుంది. ఇది నరాలకు విశ్రాంతినిస్తుంది. అంతే కాకుండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్త పోటుతో ఇబ్బంది పడే వారు ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
3. ఆస్తమా:
ధ్యానం శ్వాస ప్రక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఊపిరితిత్తులను కూడా సడలిస్తుంది. తద్వారా ఆస్తమా దాడుల అవకాశాలను కూడా తగ్గిస్తుంది.
4. నిద్ర సంబంధిత సమస్యలు:
ధ్యానం మనస్సును ప్రశాంతపరుస్తుంది. అంతే కాకుండా నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ధ్యానం చేసేవారిలో నిద్రలేమి చాలా తక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
5. జీర్ణ సమస్యలు:
ఒత్తిడి జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఆమ్లత్వం, మలబద్ధకం, అజీర్ణం వంటి గ్యాస్ట్రిక్ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో ధ్యానం సహాయపడుతుంది.
Also Read: ఈ టిప్స్ పాటిస్తే.. ఇంట్లో ఒక్క బొద్దింక కూడా ఉండదు
ధ్యానం ఎలా చేయాలి ?
ప్రతి ఉదయం లేదా సాయంత్రం 10–15 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి.
ప్రశాంతమైన ప్రదేశంలో కళ్ళు మూసుకుని గాఢంగా గాలి పీల్చుకోండి.
శ్వాసపై మీ దృష్టిని కేంద్రీకరించండి.
మొబైల్ లేదా టీవీకి దూరంగా ఉండండి. ఈ సమయాన్ని పూర్తిగా మీకే కేటాయించుకోండి.