BigTV English

OTT Movie : పేదోన్ని ప్రేమించే డబ్బున్న అమ్మాయి… ఈ లవ్ స్టోరీ చూస్తే వచ్చే కిక్కే వేరప్పా

OTT Movie : పేదోన్ని ప్రేమించే డబ్బున్న అమ్మాయి… ఈ లవ్ స్టోరీ చూస్తే వచ్చే కిక్కే వేరప్పా

OTT Movie : లవ్ స్టోరీలు రకరకాలుగా ఉంటాయి. వీటి గురించి చెప్పుకుంటూ పోతే మాటలు సరిపోవు. అయితే ఇప్పుడు మనం ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ గురించి చెప్పుకుందాం. ఒక డబ్బున్న అమ్మాయిని, పేదవాడు ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చక్కగా చూపించారు. చాలా సినిమాలలో ప్రేమ కోసం రక్తపాతాలు జరుగుతూ ఉంటాయి. లేనిపోని టార్చర్లు కూడా పెడుతుంటారు. అయితే ఈ సినిమాలో స్టోరీ చాలా చక్కగా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ హాలీవుడ్ ఫీల్ గుడ్ మూవీ పేరు ‘ది నోట్ బుక్’ (The notebook). ఈ అమెరికన్ రొమాంటిక్ డ్రామా మూవీకి నిక్ కాస్సావెట్స్ దర్శకత్వం వహించారు.  ఈ మూవీ నికోలస్ స్పార్క్స్ 1996 లో రాసిన నవల ఆధారంగా రూపొందించబడింది. ఈ మూవీలో ర్యాన్ గోస్లింగ్,  రాచెల్ మక్ ఆడమ్స్ ప్రేమలో పడే యువ జంటగా నటించారు. ఈ మూవీ యునైటెడ్ స్టేట్స్‌లో జూన్ 25, 2004న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద స్లీపర్ హిట్‌గా నిలిచింది. $29 మిలియన్ బడ్జెట్‌తో తెరకెక్కగా, $117 మిలియన్లు వసూలు చేసింది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

బాగా డబ్బున్న అమ్మాయి అయిన హీరోయిన్ ఒక ఎగ్జిబిషన్ కి వస్తుంది. ఆమెను అక్కడే ఉన్న హీరో చూసి ప్రేమలో పడతాడు. హీరో ఒక పేదవాడి గానే ఉంటాడు. హీరోయిన్ జెయింట్ వీల్ తిరుగుతూ ఉంటుంది. అక్కడికి హీరో జైంట్ వీల్ ని పట్టుకొని ఆమె ఉన్నచోటికి వస్తాడు. తనతో డేట్ కి వస్తేనే దిగుతానని బెదిరిస్తాడు. హీరోయిన్ కూడా డేట్ కి వస్తానని చెప్తుంది. అలా వాళ్ళిద్దరి పరిచయం ప్రేమ వరకు వెళ్తుంది. హీరోతో ఆమె ప్రయాణం చాలా బాగా ఉంటుంది. అలా ఒక డబ్బున్న అమ్మాయి స్వేచ్ఛగా హీరోతో తిరుగుతుంది. ఒకసారి హీరోయిన్, హీరో ఇంటికి వస్తుంది. హీరో తండ్రితో కాసేపు మాట్లాడి అక్కడే డిన్నర్ చేసి వెళ్ళిపోతుంది. హీరోని కూడా తన ఇంటికి డిన్నర్ కి రమ్మంటుంది. అయితే హీరోని ఆమె తల్లిదండ్రులు అవమానించే విధంగా మాట్లాడుతారు. ఆ తర్వాత హీరోయిన్ ను ఆమె తల్లి పై చదువులకు అమెరికాకి పంపిస్తుంది. హీరోని వదిలి పోయేటప్పుడు చాలా బాధపడుతుంది హీరోయిన్. తొందరలోనే వచ్చి పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇస్తుంది. అయితే హీరోయిన్ వెళ్లిన తర్వాత ప్రతిరోజు లెటర్లు రాస్తూ ఉంటాడు హీరో. ఒక లెటర్ కి కూడా అటువైపు నుంచి సమాధానం రాదు. సంవత్సరం వరకు లెటర్లు రాస్తూనే ఉంటాడు. ఆ తర్వాత హీరో సైన్యంలో చేరిపోతాడు. కొంతకాలం సైన్యంలో సర్వీస్ చేసి ఇంటికి వస్తాడు హీరో.

అప్పుడు తన ఇంటిని అమ్మకానికి పెడతాడు. ఆ ఫోటోని ఒక పేపర్లో చూస్తుంది హీరోయిన్. అప్పటికే ఆమె మరొకరిని ప్రేమించి ఉంటుంది. ఆ ఫోటో చూసి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకుని హీరో కోసం వస్తుంది. తనకు ఒక ఉత్తరం కూడా రాయాలనిపించలేదా అని అడుగుతుంది. సంవత్సరం పాటు రాశానని చెప్పడంతో ఆమె ఎమోషన్ అవుతుంది. అలా వాళ్ళిద్దరూ ఎమోషన్ లో ఉండగా హీరోయిన్ తల్లి అక్కడికి వస్తుంది. ఆమెను తీసుకుని ఒకచోటికి వెళుతుంది. అక్కడ ఒక అంకుల్ ని చూపించి, ఇతన్ని నేను ఒకప్పుడు ప్రేమించానని చెప్తుంది. అయితే నా తల్లిదండ్రులు వేరొకరికి ఇచ్చి పెళ్లి చేశారని చెప్తుంది. ఇప్పుడు నేను రిచ్ గా బతకగలుగుతున్నానని, అదే అతన్ని చేసుకొని ఉంటే పేదింట్లో ఉండిపోయేదాన్నని  చెబుతుంది. అప్పుడు హీరోయిన్ కూడా ఆలోచనలో పడుతుంది. చివరికి హీరోయిన్ ఏ నిర్ణయం తీసుకుంటుంది? అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడండి.

Tags

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×