BigTV English

Devara: ఆయుధ పూజ వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్..

Devara: ఆయుధ పూజ వీడియో సాంగ్ వచ్చేసిందిరోయ్..

Devara:ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత  మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర.  కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు  ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్  సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్  27 న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.  ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్  నటించగా .. సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.


మొదటిరోజు నుంచి మిక్స్డ్ టాక్ ను అందుకోగా.. పోను పోను దేవర మంచి కలక్షన్స్ అందుకుంది. 16 రోజుల్లో దేవర .. రూ. 506 కోట్ల కలక్షన్స్ అందించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే అవన్నీ ఫేక్ కలక్షన్స్  అని  నెటిజన్స్  ట్రోల్స్  కూడా చేశారు.  దానికి  నిర్మాత నాగవంశీ  కూడా స్పందించిన విషయం తెల్సిందే.  ఈ కలక్షన్స్ కు సంబంధించిన పోస్టర్స్ కేవలం ఫ్యాన్స్ కోసమే అని, తాము కలక్షన్స్ రాకుండా ఎందుకు చెప్తామని..  మేముచెప్పింది  మీరు నమ్మనప్పుడు చెప్పడం దేనికి.. మీరు ఏది అనుకుంటే అదే అనుకోండి అని మీడియా ముందే తెలిపాడు.

Jagapathi Babu: ఎంత ఎదవగా చేస్తే.. అన్ని అవార్డులు.. షాకింగ్ కామెంట్స్ చేసిన జగ్గు భాయ్


ఇక ఆ తరువాత  ఎవరు ఈ కలక్షన్స్ గురించి మాట్లాడలేదు. నిజం చెప్పాలంటే.. రాజమౌళితో సినిమా చేశాక.. ఈ  రేంజ్ హిట్ అందుకోవడం అనేది ఎన్టీఆర్ కే సాధ్యమైంది.  దేవర సినిమా కథ అంతా అందరికీ తెల్సినా ఎన్టీఆర్ ను స్పెషల్ గా కొరటాల చూపించిన తీరు అద్భుతం. ముఖ్యంగా సముద్రపు సీన్స్, షార్క్ ఫైట్.. ఇవన్నీ  ఫ్యాన్స్ ను థియేటర్ వరకు తీసుకెళ్లాయి.

ఇక దేవర సినిమా చూడడానికి మరో ముఖ్యమైన కారణం ఆయుధ పూజ సాంగ్. కేవలం  థియేటర్ లో ఈ సాంగ్ చూడడానికే చాలామంది ప్రేక్షకులు వెళ్లారు అంటే అతిశయోక్తి కాదు. సినిమా ప్రమోషన్స్ లో సాంగ్ రిలీజ్ చేయకుండా  రిలీజ్ కు ఒక రోజు ముందు ఆయుధ పూజ వీడియో సాంగ్ ను 2 నిముషాల నిడివితో  రిలీజ్ చేశారు. అందులో ఎన్టీఆర్ డ్యాన్స్  ఎవరికైన పూనకాలు తెప్పించక మానదు.   అనిరుథ్ మ్యూజిక్.. ఎన్టీఆర్ స్టెప్స్  నెక్స్ట్ లెవెల్  అని చెప్పాలి.

Genelia: హ.. హ.. హాసిని న్యూలుక్ చూశారా.. ఎంత క్యూట్‌గా ఉందో..

ఎన్టీఆర్ కెరీర్ లోనే ది బెస్ట్ సాంగ్  లిస్ట్ లో ఆయుధ పూజ టాప్ 10 లో  ఉంటుంది చెప్పొచ్చు. ఇక తాజాగా ఆయుధ పూజ  ఫుల్ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మూడు నిమిషాల  5 సెకన్స్  ఉన్న ఈ వీడియో మొత్తం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ డ్యాన్స్ కు ఫ్యాన్స్  ఫిదా  కాకుండా ఉండలేరు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే దేవర ఓటీటీలో రిలీజ్ కు రెడీ అవుతుంది. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసిన విషయం విదితమే.  మరి థియేటర్ లో రచ్చ చేసిన  ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×