SS Rajamouli Controversy : టాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli), ఆయన సతీమణి రమా రాజమౌళి (Rama Rajamouli) ట్రయాంగిల్ లవ్ స్టోరీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. జక్కన్నకు స్నేహితుడైన నిర్మాత శ్రీనివాస రావు (Producer Sriniavasa Rao) రాజమౌళి టార్చర్ ను భరించలేకపోతున్నానని, తన చావుకు కారణం అతడేనని సూసైడ్ నోట్ రాయడంతో పాటు, సెల్ఫీ వీడియో తీసి రిలీజ్ చేయడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే 30 ఏళ్ల కిందట ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో అసలు ఏం జరిగింది? రాజమౌళి చేసిన తప్పేంటి? అనే విషయాలపై స్పందించారు నిర్మాత చిట్టిబాబు.
30 ఏళ్ల కిందట జరిగింది ఇదే?
30 ఏళ్ల కిందట అసలు రాజమౌళి లవ్ స్టోరీ ఏం జరిగింది? అప్పట్లో నిర్మాత శ్రీనివాసరావు ఈ వివాదాన్ని ఇండస్ట్రీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారా? అప్పుడు వదులుకున్న అమ్మాయిని ఇప్పుడు కావాలని, రాజమౌళి ఆయన భార్యపై నిందలు వేసి, సొసైటీలో దిగజార్చే విధంగా ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేశారు? అనే ప్రశ్నకి నిర్మాత చిట్టిబాబు స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.
రాజమౌళి వివాదంపై నిర్మాత చిట్టిబాబు మాట్లాడుతూ “27 ఏళ్ల కిందటి స్టోరీ ఇది. వీళ్లిద్దరూ అరబ్ దేశంలో పని చేశారు. జీవితంలో రాజమౌళి ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న రోజులవి. ఆ తర్వాత రాజమౌళి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. బాగా కష్టపడి మంచి స్థాయిలోకి వచ్చాడు. ఆ టైంలోనే ఆమెతో ఫ్రెండ్షిప్, పెళ్లి జరిగిపోయాయి. ఆమె భర్తను కాదనుకొని రాజమౌళితో వచ్చేసింది. ఇదంతా అందరికీ తెలిసిందే. ఈ విషయం బయటకు చెప్తానేమోనని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, కష్టపెడుతున్నాడు, చావడం తప్ప మరో మార్గం లేదు అని శ్రీనివాస్ మాట్లాడుతున్నాడు. అతను చెప్పిన దాంట్లో ఒకదానికొకటి పొంతన లేకుండా ఉంది. అప్పుడెప్పుడో ‘యమదొంగ’ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేశాడు. ఆ తర్వాత జనాలకి అతను ఎవరో గుర్తులేదు. మళ్లీ జనాల్లోకి రావడానికి ఇలాంటి పని చేస్తున్నట్టుగా అనిపిస్తోంది” అని అన్నారు.
రాజమౌళి ప్రతిష్టను దిగజార్చే కుట్ర
చిట్టిబాబు మాట్లాడుతూ “ఎందుకంటే అతను ప్రస్తావించిన ప్రతి ఒక్కరూ అతనికి స్నేహితులే అంటున్నాడు. వారంతా ఇండస్ట్రీలో పెద్ద తలకాయలు. మరి ఇన్నేళ్లపాటు ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఏం చేశావు? గోళ్ళు గిల్లుకుంటూ కుర్చున్నావా?” అని శ్రీనివాస రావుపై ఫైర్ య్యారు.
“రాజమౌళి నేడు మంచి పొజిషన్ లో ఉన్నాడు. కాబట్టి అతనిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా రాజమౌళిని ఇలా వివాదంలోకి లాగు, సెటిల్మెంట్ చేస్తాము అని చెప్పారేమో… మంచి స్థాయిలో ఉన్నాడు… కాబట్టి ఇలాంటివి చేస్తే అతడి పరువుపోయి, దిగి వస్తాడు అనే కోణంలో కుట్ర జరుగుతోందా? లేదంటే తను మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడా? అనేది తెలీదు. నీతి, రీతి… సరైన జాతికి పుట్టిన మాటలు మాట్లాడట్లేదు. ఏదైనా సెటిల్మెంట్ ఆశించి, లేదంటే ఎవరి ప్రోద్బలంతోనో ఇలాంటి పని చేస్తున్నట్టు ఉన్నాడు. శ్రీనివాసరావును పిచ్చాసుపత్రికి పంపాలి. రాజమౌళి ఎప్పుడూ నిర్మాతను తొక్కిపెట్టి సినిమాను తీయలేదు. ఏదో ఒకటి రెండు సినిమాలకు అడ్వాన్స్ తీసుకుని, బిజీ షెడ్యూల్ వల్ల చేయలేకపోయాడు అంతే” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.