BigTV English
Advertisement

Anti Aging Tips: ఏజ్ పెరుగుతున్నా కూడా యంగ్‌గా.. కనిపించాలంటే ఇవి తినాల్సిందే !

Anti Aging Tips: ఏజ్ పెరుగుతున్నా కూడా యంగ్‌గా.. కనిపించాలంటే ఇవి తినాల్సిందే !

Anti Aging Tips: వయస్సు పెరిగే కొద్దీ ముఖం, శరీరంపై కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. పెరుగుతున్న వయస్సు నుండి ఎవరూ తప్పించు కోలేరన్నది వాస్తవం. కానీ సరైన జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లతో వృద్ధాప్య ప్రభావాలను తగ్గించవచ్చు. ఏజ్ పెరుగుతున్నా కూడా యవ్వనంగా ఉండాలనుకుంటే, మీ జీవనశైలి, ఆహారపు అలవాట్లలో అవసరమైన మార్పులు తప్పకుండా చేసుకోవాలి. మీరు తినే రోజు వారీ ఆహారంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను చేర్చుకోవడం ద్వారా ఏజ్ పెరుగుతున్నా కూడా చాలా యవ్వనంగా కనిపించవచ్చు. మరి ఎలాంటి ఫుడ్ తింటే యవ్వనంగా కనిపిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అంతే కాకండా ఇవి ముడతలను తగ్గించడమే కాకుండా, మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. మరి అలాంటి యాంటీ ఏజింగ్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

యాంటీ ఏజింగ్ ఫుడ్స్:


దానిమ్మ:

ఏజ్ పెరుగుతున్నా కూడా యవ్వనంగా ఉండాలనుకుంటే, దానిమ్మ తినడం మంచిది. దానిమ్మలో లభించే విటమిన్లు, పోషకాలు ,యాంటీ-ఆక్సిడెంట్లు చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. అంతే కాకుండా ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి కూడా సహాయపడతాయి. ఫలితంగా యవ్వనంగా కనిపించేందుకు అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా చర్మాన్ని మృదువుగా మార్చే సమ్మేళనాలు కూడా దానిమ్మలో ఉంటాయి.

అవకాడో:

వయసు పెరిగే కొద్దీ మన చర్మం తేమను కోల్పోవడం ప్రారంభిస్తుంది. దీని వల్ల చర్మం పొడి బారిపోయి నిర్జీవంగా మారుతుంది. అవకాడోలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుషల్కంగా ఉంటాయి. ఇందులో స్కిన్ కేర్‌కు ఉపయోగపడే మోనోశాచురేటెడ్ కొవ్వు కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ సమ్మేళనాలు చర్మంపై సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. ఫలితంగా యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.

ఎగ్స్:

మీరు మాంసాహారులైతే గుడ్లు తినడం ప్రారంభించండి. ఎగ్ ఒక అద్భుతమైన యాంటీ ఏజింగ్ ఫుడ్. దీనిని ప్రోటీన్ యొక్క పవర్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఎగ్ దెబ్బతిన్న కండరాలను మరమ్మతు చేయడంలో చాలా బాగా పని చేస్తుంది. అంతే కాకుండా మనం పెద్దయ్యాక ఇది కండరాల టోన్‌ను నిర్వహిస్తుంది.

ఆకుపచ్చ కూరగాయలు:

మీ ఆహారంలో ఆకుకూరల పరిమాణాన్ని పెంచండి. పాలకూర, ఆవాల కూర, మెంతి కూర వంటి ఆకుకూరలు వృద్ధాప్యాన్ని నిరోధించే లక్షణాలతో నిండి ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు సహా అనేక పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. అంతే కాకుండా మన మొత్తం ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది.

Also Read: అవిసె గింజలతో.. అద్భుత ప్రయోజనాలు !

పెరుగు:

పెరుగు మిమ్మల్ని యవ్వనంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది ప్రోబయోటిక్స్ . కాల్షియం అధికంగా ఉండే ఆహారం. పెరుగు ఒక అద్భుతమైన యాంటీ ఏజింగ్ ఫుడ్. ఇది మీ చర్మాన్ని మృదువుగా , ప్రకాశవంతంగా ఉంచుతుంది. దీన్ని తినడం వల్ల ముడతలు తగ్గుతాయి. ఏజ్ పెరుగుతున్నా కూడా మీరు యవ్వనంగా కనిపించేందుకు పెరుగు తినడం అలవాటు చేసుకోవడం మంచిది.

Related News

Masala Vada: బండి మీద దొరికే మసాలా వడ.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Worshipping God: నిద్రలేవగానే కరదర్శనం.. సానుకూల శక్తితో రోజును ప్రారంభించడానికి పునాది!

Tattoo: పచ్చబొట్లు తెగ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలిసుండాలి!

Big Stories

×