BigTV English
Advertisement

Dil Raju : ‘పెద్దాపురం’ పనిలో బిజీగా దిల్ రాజు… డిజాస్టర్ టీంతో రిస్క్ చేస్తున్నాడా?

Dil Raju : ‘పెద్దాపురం’ పనిలో బిజీగా దిల్ రాజు… డిజాస్టర్ టీంతో రిస్క్ చేస్తున్నాడా?

Dil Raju : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) సోదరుడి కొడుకు ఆశిష్ రెడ్డి (Ahish Reddy) ‘రౌడీ బాయ్స్’ అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ ఈ హీరో ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. ఈ నేపథ్యంలోనే ఆశిష్ కి హిట్ ఇవ్వడానికి దిల్ రాజు తీవ్రంగా ట్రై చేస్తున్నారు. అందులో భాగంగా ఓ డిజాస్టర్ టీం మొత్తాన్ని ఒక్క దగ్గరకు చేర్చి, ఆశిష్ హీరోగా కొత్త మూవీని ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ బ్యాక్ డ్రాప్ ఏంటి? టైటిల్ ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ విషయం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.


ఆశిష్ కొత్త మూవీ టైటిల్ ఇదేనా?

రౌడీ బాయ్స్, సెల్ఫిష్, లవ్ మీ వంటి సినిమాల తర్వాత ఆశిష్ రెడ్డి చేస్తున్న కొత్త సినిమా ఇది. దిల్ రాజు నిర్మాతగా త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఈ కొత్త మూవీ రూపొందుతున్నట్టు సమాచారం. ఇక ఈ కథకు మరో ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ కథను అందిస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాకు ‘పెద్దాపురం’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అయితే ఈ విషయంపై మేకర్స్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు.


దిల్ రాజు రిస్క్ చేస్తున్నారా?

నిర్మాత దిల్ రాజు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో తాజాగా ఓ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సంక్రాంతికి దిల్ రోజు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో పాటు ‘గేమ్ ఛేంజర్’ కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. భారీ హైప్ తో రిలీజ్ అయిన ఈ మూవీ అంచనాలను అందుకోలేక చతికిలబడింది. ఫలితంగా భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది దిల్ రాజు. అలాంటి గడ్డు పరిస్థితిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ తక్కువ బడ్జెట్ తో రిలీజై, భారీ లాభాలను తెచ్చి పెట్టి, దిల్ రాజును కొంత వరకు నష్టాల నుంచి గట్టెక్కించింది. కానీ ఇప్పుడు ఆయన మరోసారి డిజాస్టర్ టీంతో రిస్క్ చేస్తున్నారా ? అనే టాక్ నడుస్తోంది.

దానికి కారణం ఆశిష్ కొత్త ప్రాజెక్ట్. ఆశిష్ ఇప్పటిదాకా రెండు మూడు సినిమాలు చేసినా ఒక్క హిట్ కూడా పడలేదు. ఇక డైరెక్టర్ త్రినాధరావు నక్కిన చివరగా ‘మజాకా’ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదన్న విషయం తెలిసిందే. ఈ టీంలో డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఉన్నారు. ఆయన కూడా ఇటీవల కాలంలో హిట్టు లేక సతమతమవుతున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్ బచ్చన్’ అనే డిజాస్టర్ సినిమా మీద ఇప్పటికీ ట్రోల్స్ నడుస్తుంటాయి. ఇలా వరుస డిజాస్టర్లలో ఉన్న హరీష్ శంకర్, త్రినాధరావు నక్కిన, ఆశిష్ ముగ్గురినీ ఒకచోటకు చేర్చి… దిల్ రాజు సినిమాను నిర్మిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×