BigTV English

Botsa : సత్తిబాబుకో లెక్కుంది.. జనసేనలోకి దారుంది..!?

Botsa : సత్తిబాబుకో లెక్కుంది.. జనసేనలోకి దారుంది..!?

Botsa : బొత్స సత్యనారాయణ. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో మళ్లీ హాట్ టాపిక్ అయ్యారు. అసెంబ్లీ ఆవరణలో దిగిన గ్రూప్ ఫోటో తాజా చర్చకు.. రచ్చకు కారణం. అదిగో బొత్స పవన్‌తో మాట్లాడుతున్నారు. జనసేనలోకి జంప్ అవుతున్నారు అంటూ వేడి వేడి వార్తలు పొగలు సెగలు కక్కుతున్నాయి. బొత్స ఎందుకు వైసీపీని వీడుతారు అని కొందరు.. ఎందుకు వీడిపోతారో చెబుతూ మరికొందరు.. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.


డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ క్లోజ్‌గా మూవ్ అయ్యారనేది ఓపెన్ సీక్రెట్. వీడియోలు, ఫోటోల్లో ఆ విషయం స్పష్టంగానే తెలుస్తోంది. మరి, జనసేనానితో బొత్స ఇంతగా క్లోజ్ ఉండటం చూసి జగన్ తట్టుకోలేక పోయారని.. ఆయన్ను తాడేపల్లి పిలిపించి క్లాస్ పీకడానికి రెడీ అవుతున్నారని ఓ ప్రచారం నడుస్తోంది. అసలే ప్రస్తుతం వైసీపీ వీడిపోయే కాలం నడుస్తోంది. ఐదుగురు ఎమ్మెల్సీలు జగన్‌కు గుడ్ బై చెప్పేశారు. బొత్స లాంటి సీనియర్లు మాత్రమే అధినేతను అంటిపెట్టుకుని ఉన్నారు. బాలినేని, విజయసాయిరెడ్డిలు హ్యాండ్ ఇచ్చేశారు. పవర్ లేని.. ఇలాంటి పూర్ టైమ్‌లో.. ఉత్తరాంధ్రలో బలమైన లీడరైన బొత్సాను టచ్ చేసే ధైర్యం జగన్ చేయగలరా? చేస్తారా? బాస్ క్లాస్ పీకితే.. బొత్స పడుంటారా?

సత్తిబాబు విమర్శలు పదునుగా ఉన్నా.. అన్నిపార్టీలతో ఆయన ఆప్యాయంగానే ఉంటారు. సీనియర్ మోస్ట్ లీడర్ కావడంతో దాదాపు అందరు నాయకులతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఇటు మెగా ఫ్యామిలీతోను, పవన్ కల్యాణ్‌తోనూ ఫ్రెండ్‌షిప్ ఉంది. ఆ మధ్య జనసేనానిని బొత్స హగ్ చేసుకోవడం కూడా అప్పట్లో ఇలాంటి అలజడికే కారణమైంది. ఈసారి కూడా అలాంటి క్యాజువల్ టాక్, క్యాజువల్ మీట్ మాత్రమేనా? సంథింగ్ సంథింగ్ నడుస్తోందా? అనే పొలిటికల్ డౌట్ మాత్రం లేకపోలేదు.


Also Read : కొలికపూడి మర్డర్ స్కెచ్? జనసేన కంప్లైంట్.. పవన్ ఎంటరైతే..?

ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్‌లో ఉంది. కూటమి ప్రభుత్వంపై జగన్ ఒంటికాలిపై లేస్తున్నారు. వంశీలాంటి కీలక నేతలను జైల్లో పెట్టి.. రెడ్ బుక్‌తో టీడీపీ కవ్విస్తుంటే.. ఏం చేసేది లేక, చేయలేక జగన్ రగిలిపోతున్నారని అంటున్నారు. ఇలాంటి టైమ్‌లో బొత్స.. జనసేనానితో క్లోజ్‌గా కనిపిస్తే వైసీపీ శ్రేణుల్లోకి ఎలాంటి మెసేజ్ వెళ్తుందని అధినేత సీరియస్‌గా ఉన్నారని టాక్. కాస్త కంట్రోల్‌గా ఉండమని బొత్సను పిలిపించి చెబుతారని లీక్స్.

మరోవైపు, తన రాజకీయ భవిష్యత్తుపై బొత్స సత్యనారాయణ ఇప్పటినుంచే ప్లాన్ బీ, ప్లాన్ సీ లు లాంటివి రెడీ చేసుకుంటున్నారనీ అంటున్నారు. ఉత్తరాంధ్రలో బలమైన బీసీ నేత బొత్స. ఏ పార్టీకైనా అలాంటి నాయకుడు అవసరం. బొత్స ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకే అదనపు బలం. బొత్స వస్తానంటే ఏ పార్టీ కూడా వద్దనక పోవచ్చు. ప్రస్తుతం పవర్ లేదు. ఎమ్మెల్సీగా ఉన్నా పార్టీ అధికారంలో లేకపోతే పనులు జరగవు. పరపతి ఉండదు. వచ్చే ఎన్నికల్లోనూ కూటమి తరఫునే పోటీ చేస్తామని, 10 ఏళ్లు పవర్‌లో ఉంటామని పవన్ ధీమాగా చెబుతున్నారు. అలా చూస్తే.. వైసీపీలో ఉండి.. కేసులు గట్రా ఎదుర్కోవడం కంటే.. జనసేనలోకి వెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా బొత్స మదిలో మెదులుతోందని ఆయన సన్నిహిత వర్గాల మాట. బొత్స చేరితే.. ఉత్తరాంధ్రలో జనసేనకు గట్టి బలం వచ్చినట్టే. బాలినేనిలానే బొత్సకూ పవన్ గ్రాండ్ వెల్‌కమ్ చెప్పొచ్చు. ఈ డౌటే జగన్‌ను ఉలిక్కిపడేలా చేస్తోందట. సరదాగా సాగిపోయిన ఫోటో సెషన్‌పై వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోందంట. ఏమో.. బొత్స మారినా మారిపోవచ్చు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటారుగా!

Related News

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

Big Stories

×