BigTV English

Dil Raju : కొత్త దర్శకులు క్లాసిక్స్ ఇచ్చారు, పెద్ద దర్శకులు తడబడుతున్నారు

Dil Raju : కొత్త దర్శకులు క్లాసిక్స్ ఇచ్చారు, పెద్ద దర్శకులు తడబడుతున్నారు

Dil Raju : ఇప్పుడు కాస్త వెనక పడ్డారు కానీ ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ అంటే దిల్ రాజు పేరు వినిపించేది. దిల్ రాజు సినిమాలు ఏ సీజన్ లో రిలీజ్ అయిన అవ్వకపోయినా ఖచ్చితంగా సంక్రాంతికి మాత్రం ఒక సినిమా రిలీజ్ అవుతూ వస్తుంది. శ్రీ వెంకటేశ్వర బ్యానర్స్ నుండి సంక్రాంతికి రిలీజ్ అయిన ప్రతి సినిమా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసి అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. వెంకటేష్ మహేష్ బాబు నటించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఆ రోజుల్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలానే ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలతో పాటుగా రిలీజ్ అయిన శతమానం భవతి కూడా అద్భుతమైన ఘనవిజయం సాధించింది. రెండు స్టార్ హీరోల సినిమాలు మధ్యలో కూడా శతమానం భవతి అద్భుతమైన స్కోర్ చేసింది. ఆడియన్స్ అంతా కూడా ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఈ సంక్రాంతికి కూడా రెండు సినిమాలను సిద్ధం చేశాడు దిల్ రాజు.


శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజెర్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం ఈ రెండు సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలయ్యాయి. కేవలం 2025 సంక్రాంతి మాత్రమే కాకుండా ఆ ఇయర్ మొత్తానికి కూడా సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశాడు దిల్ రాజు. ప్రస్తుతం దిల్ రాజు ఏడు సినిమాలకి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంక్రాంతి సీజన్ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న తమ్ముడు సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో నితిన్ హీరోగా కనిపిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయం అవుతున్న ‘ఆకాశం దాటి వస్తావా’ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాతో ఒక కొత్త దర్శకుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు.

ఇకపోతే సంక్రాంతి కానుక విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఈ సినిమాకి ఫేక్ కలెక్షన్స్ కాకుండా నిజమైన కలెక్షన్స్ వేశారు అని ప్రశంసలు కూడా వస్తున్నాయి. అయితే కొన్ని సందర్భాలలో పెద్ద హీరోల సినిమాలుకు ఫేక్ కలెక్షన్స్ వేయటం అనేది ఈ మధ్య ట్రెండ్ గా మారింది. ఈ తరుణంలో చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ ను ఒకచోట చేర్చి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు దిల్ రాజు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత మేరకు లాభాలు తీసుకొచ్చిందో డిస్టిబ్యూటర్స్ అంతా తమ మాటల్లో తెలియజేశారు. ఇక ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ మా సంస్థలో పనిచేసిన కొత్త దర్శకులు అంతా క్లాసిక్స్ ఇచ్చారు కానీ ఇప్పుడు సీనియర్ దర్శకులు తడబడుతున్నారు. అంటూ మాట్లాడారు. దీనిని బట్టి దిల్ రాజు దర్శకుడు శంకర్ ని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసి ఉంటారు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ బ్యానర్లో దర్శకులుగా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల, సుకుమార్, బొమ్మరిల్లు భాస్కర్ వంటి ఎంతోమంది కొత్త దర్శకులు ఈ బ్యానర్ కి సక్సెస్ఫుల్ సినిమాలను ఇచ్చిన విషయం తెలిసిందే.


Also read : Thandel – Allu Arjun Speech : మళ్ళీ ట్రోలర్స్ స్టఫ్ ఇస్తాడా.?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×