Nani: మామూలుగా నటీనటులు ప్రతీ సినిమాకు తమ ఫిజిక్, హెయిర్ స్టైల్.. ఇలా అన్నీ మారుస్తూనే ఉంటారు. పాత్రలో మార్పులు కనిపించడం కోసం ఎంత కష్టపడడానికి అయినా సిద్ధంగా ఉంటారు. నేచురల్ స్టార్ నాని అయితే శారీరికంగా తనలో మార్పులు చేసినా చేయకపోయినా ప్రతీ పాత్రలో ప్రేక్షకులు ఒక కొత్తదనం కనిపించేలా మాత్రం చేయగలుగుతాడు. కానీ మొదటిసారి ఒక సినిమా కోసం తన ఫిజిక్‌ను పూర్తిగా మార్చేసి జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేస్తున్నాడు ఈ నేచురల్ స్టార్. దానికి సంబంధించిన ఫోటోను తానే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ కూడా చేశాడు. అంతే కాకుండా తన అప్‌కమింగ్ మూవీ నుండి ఆసక్తికర అప్డేట్ కూడా అందించాడు.
కొత్త అప్డేట్
ప్రస్తుతం నాని (Nani).. శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్ 3’ సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి కూడా అడుగుపెట్టనుంది. అందుకే తన అప్‌కమింగ్ సినిమాలపై నాని ఫోకస్ పడింది. అందులో ముందుగా ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)ను లైన్‌లో పెట్టాడు. ‘దసరా’ అనే సినిమాతో శ్రీకాంత్‌ను దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం చేశాడు నాని. మళ్లీ తనపై నమ్మకంతో తనకు మరొక అవకాశం ఇచ్చాడు. ఇప్పటికే నాని, ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీకి ‘ప్యారడైజ్’ (Paradise) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీకి ఎవరు సంగీతాన్ని అందిస్తున్నారనే విషయాన్ని కూడా నాని రివీల్ చేశాడు.
హ్యాట్రిక్ కాంబో
‘ప్యారడైజ్’కు సంగీతాన్ని అందించడానికి అనిరుధ్ రవిచందర్‌ను రంగంలోకి దించారు మేకర్స్. ఇప్పటికే నాని, అనిరుధ్ కాంబినేషన్‌లో ‘గ్యాంగ్ లీడర్’, ‘జెర్సీ’ సినిమాలు వచ్చాయి. ఆ రెండూ మ్యూజికల్ హిట్‌ను సాధించాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టడానికి ఈ కాంబో సిద్ధమయ్యింది. తన సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడని సంతోషంగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు నాని. అలా రోజురోజుకీ ‘ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇంతలోనే ఈ మూవీ కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చడానికి సిద్ధమయ్యాడు. మునుపెన్నడూ లేని విధంగా జిమ్‌కు వెళ్లి కండలు పెంచడం మొదలుపెట్టాడు.
Also Read: నాతో మీకేంటి ప్రాబ్లమ్.. మీడియాపై పూజా హెగ్డే ఫైర్..
ఫోటోతోనే హైప్
మామూలుగా తనకు జిమ్‌కు వెళ్లి కండలు పెంచే అలవాటు లేదని, కానీ ప్రతీ క్యారెక్టర్ కోసం తనలో శారీరికంగా మార్పులు కనిపించడం కోసం డైట్ మెయింటేయిన్ చేస్తానని పలుమార్లు బయటపెట్టాడు నాని. అలాంటిది ‘ప్యారడైజ్’ కోసం తానే స్వయంగా జిమ్‌కు వెళ్లి కండలు పెంచడం మొదలుపెట్టాడు. ఆ ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసి నాని పూర్తిగా మారిపోయాడని అనుకుంటున్నారు ఫ్యాన్స్. మొత్తానికి ‘ప్యారడైజ్’ నుండి రోజురోజుకీ బయటికి వస్తున్న అప్డేట్స్ చూసి ఇది పక్కా హిట్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. ఈ మూవీ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.
#Nani prepping up for his upcoming 🔥🔥🔥🔥🔥🔥 #TheParadise #HIT3 @NameisNani pic.twitter.com/0TUDUsc5sI
— Nani Trends™ (@TrendsforNani) February 1, 2025