Thandel – Allu Arjun Speech : చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న సినిమా తండేల్. ఈ సినిమా కొన్ని యథార్థ సంఘటనలను ఆధారంగా చేసుకొని తెరకెక్కింది. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా ట్రైలర్ కూడా మంచి అంచనాలను పెంచుతుంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు నిర్వహిస్తుంది చిత్ర యూనిట్. ఈవెంట్ కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు. అయితే సర్వత్ర అల్లు అర్జున్ స్పీచ్ పైన ఆసక్తి నెలకొంది. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ హాజరవుతున్న ఈవెంట్ ఇది. పుష్ప విషయంలో అల్లు అర్జున్ ఎన్ని వివాదాలు ఎదుర్కొన్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక అనుకోని సంఘటన వలన జైలులో కూడా గడపాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత చాలా ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ హాజరయ్యాడు. కానీ సినిమా సక్సెస్ అయిన గ్రాండ్ ఈవెంట్ మాత్రం నిర్వహించలేదు.
అయితే అల్లు అర్జున్ మాట్లాడిన ప్రతిసారి కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా పుష్ప సినిమా విడుదలై మంచి సక్సెస్ సాధించిన తరుణంలో అందరికీ థాంక్స్ చెప్పే ప్రాసెస్లో అల్లు అర్జున్ పడిన తడబాటు చాలామందికి గుర్తుండే ఉండి ఉంటుంది. ఏకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన సందర్భం కూడా ఉంది. దీనిని టిఆర్ఎస్ అధినేత కేటీఆర్ కూడా సినిమా యాక్టర్లు కు కూడా ఈయన పేరు గుర్తు ఉండదు అని ఒక సందర్భంలో మాట్లాడారు. అయితే ఆ తర్వాత తీవ్రమైన కొన్ని పరిణామాలు జరిగాయి. అలా పేరు మర్చిపోవడం వల్లనే ఇలాంటి పరిణామాలు అన్ని జరిగాయి అని అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. ఇకపోతే రేవంత్ రెడ్డి పేరును పక్కనపెడితే దర్శకుడు సుకుమార్ పేరు కూడా తప్పు పలికాడు అల్లు అర్జున్. అప్పుడు కూడా అల్లు అర్జున్ కాస్త ట్రోల్ కి గురి అయ్యాడు. ఈరోజు తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ లో ట్రోలర్స్ కి స్టఫ్ ఇస్తాడు అంటూ ఆల్రెడీ ట్రోలింగ్ కూడా మొదలైంది.
ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమాని అల్లు అర్జున్ సమర్పిస్తున్నారు. గీతా ఆర్ట్స్ లో సినిమా అంటే అల్లు అర్జున్ తప్పకుండా వస్తారు. అందుకే అల్లు అర్జున్ ఈ సినిమాకి హాజరవుతున్నారు. ఇకపోతే ఈ సినిమా మీద చిత్ర యూనిట్ అంతా కూడా మంచి నమ్మకంతో ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ సాధిస్తుంది అని పలు ఇంటర్వ్యూస్ లో దర్శకుడు చందు కూడా ధీమా వ్యక్తం చేశాడు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా మ్యూజిక్ కూడా మంచి హిట్ అయింది. సాంగ్స్ కి మిలియన్స్ లో వీల్స్ వచ్చి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎంతటి సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి.
Also Read : Dulquer Salmaan: ఏడాది క్రితం మొదలుకావాల్సిన తెలుగు సినిమా.. ఫైనల్‌గా పట్టాలెక్కించిన దుల్కర్..