Dil Raju : విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam). ఈ మూవీ ఊహించని విధంగా మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మూవీ సక్సెస్ పట్ల సంతోషంగా ఉన్న చిత్ర బృందం తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈ మూవీని నిర్మించిన నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ వెంకీ మామ, అనిల్ రావిపూడి లపై ప్రశంసల వర్షం కురిపించారు.
క్రూషియల్ టైంలో వచ్చే కిక్కే వేరు
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ సక్సెస్ మీట్ లో తాజాగా నిర్మాత దిల్ రాజు (Dil Raju) మాట్లాడుతూ “లైఫ్ లో యావరేజ్ సినిమాలు చూసాము, ప్లాపులు, హిట్లు, సూపర్ హిట్ లు, బ్లాక్ బస్టర్, క్లాసిక్స్ అన్ని చూసాము. కానీ ఓ టైమ్ వస్తది… నా లైఫ్ డిస్ట్రిబ్యూటర్ గా మొదలై ప్లాపుల్లో ఉన్నప్పుడు ‘పెళ్లి సందడి’ సినిమా వచ్చిన రోజు ఒక కిక్ వచ్చింది. ఫస్ట్ సక్సెస్ వచ్చినప్పుడు ఆ కిక్కు వేరుగా ఉంటుంది. ప్రొడ్యూసర్ అయ్యాక వివి వినాయక్ రూపొందించిన మూవీ అయిందని హ్యాపీగా అనిపించింది. అప్పటికే వివి వినాయక్ ‘ఆది’ వంటి హిట్ సినిమాలు తీశారు. అయితే ‘ఆర్య’ అనేది మాకు అప్పట్లో చాలా కీలకం.
సెకండ్ ఫిలిం హీరో, కొత్త కాన్సెప్ట్ తో కొత్త హీరోతో సినిమా చేస్తున్నాం. అప్పుడు ‘ఆర్య’ హిట్ అవ్వడం ఒక కిక్ ఇచ్చింది. అప్పటినుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు చేశాము. ఇక ఇప్పుడు 58వ సినిమా ‘సంక్రాంతి వస్తున్నాం’ ఎంత స్పెషల్ అయింది అంటే… ఒక అద్భుతం మహాద్భుతం… ఊహించని అద్భుతం జరిగితే ఎలా ఉంటుందో, గత మూడు రోజుల నుంచి మేము అలాంటి మూమెంట్ లోనే ఉన్నాము” అంటూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సక్సెస్ పై సంతోషాన్ని వ్యక్తం చేశారు.
వెంకటేష్ నిర్మాతల హీరో
ఇక ఈ సందర్భంగా దిల్ రాజు హీరోతో పాటు మూవీ డైరెక్టర్ గురించి మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు. దిల్ రాజు మాట్లాడుతూ “సినిమాలో నాన్ స్టాప్ గా నవ్వులను ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. మా కాంబినేషన్ లో వచ్చిన ‘ఎఫ్2’ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వెంకటేష్ గురించి ఎప్పుడూ నేను చెప్పేది ఒక్కటే… నిర్మాతల హీరో వెంకటేష్. ఆయన నిర్మాతల గురించి ఆలోచించి సినిమా రిలీజ్ అయ్యాక కూడా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)కి మూవీ ప్రమోషన్ల గురించి 100 ఐడియాలు ఉండొచ్చు. కానీ హీరో నిలబడ్డప్పుడే ఆ ప్రమోషన్లు అవుతాయి. అనిల్ ప్రతి ఆలోచనకి వెంకటేష్ సపోర్ట్ గా ఉండి, ప్రమోషన్లు చేయించినందుకు హ్యాట్సాఫ్” అంటూ వెంకటేష్ ని ఆకాశానికి ఎత్తేశారు. ఇక ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే 106 కోట్లు కొల్లగొట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
Blockbuster Producer #Dilraju Garu speaks his heart out at #SankranthikiVasthunam Blockbuster Pongal Jathara ❤️🔥
Watch it here!
— https://t.co/MqOZ1QHtlH#BlockbusterSankranthikiVasthunam IN CINEMAS NOW 💥Victory @venkymama @anilravipudi @aishu_dil @Meenakshiioffl #Shirish… pic.twitter.com/K87iK5OPKi
— Sri Venkateswara Creations (@SVC_official) January 17, 2025