BigTV English

Dil Raju : ఇన్ని రోజులు ఊపిరి బిగబట్టి బ్రతికా… ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నా

Dil Raju : ఇన్ని రోజులు ఊపిరి బిగబట్టి బ్రతికా… ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నా

Dil Raju : టాలీవుడ్ లో ప్రస్తుతం అందరూ మాట్లాడుకునే సినిమా ఏదైనా ఉందంటే అది హిట్ 3. నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రం (మే1) ఈరోజు థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇందులో భాగంగా మూవీ టీం తాజాగా ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు హిట్ 3 చిత్ర బృందాన్ని అభినందించారు. అంతేకాకుండా దిల్ రాజు ఈ సినిమాపై ఎంత స్ట్రగుల్ పడ్డారో.. ఆ విశేషాలు అన్నింటిని మీడియా ముఖంగా వివరించారు.. ఆ విశేషాలు చూద్దాం..


ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నా..

నాచురల్ స్టార్ నాని హిట్ 3 తో సక్సెస్ ని అందుకున్నారు. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూకెళ్తుంది. దాంతో ఈ చిత్రయూనిట్ ను అభినందించడానికి దిల్ రాజు ప్రెస్ మీట్ ని నిర్వహించారు. దిల్ రాజు మాట్లాడుతూ.. మే1న తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి తీసుకుంది. లాస్ట్ మంత్ అంతా ఏవో సినిమాలు వస్తున్నాయి. థియేటర్లకు జనాలు సరిగ్గా రావట్లేదు, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని థియేటర్లు మూసేసుకున్న పరిస్థితి కూడా ఉంది. ఏంటి సమ్మర్ అంతా ఇలానే అయిపోతుందా అనుకున్న టైంలో, ఈ మూవీ వచ్చింది. మేమంతా హిట్ 3 మీదే నమ్మకం పెట్టుకున్నాం. ఆడియన్స్ ఈ సినిమాని ఎలా ఫుల్ ఫిల్ చేస్తారో అని అనుకున్నాం, మూడు నాలుగు రోజుల ముందే ఆన్లైన్ బుకింగ్ చూసి జనాలు థియేటర్ కి వస్తున్నారు అని, హ్యాపీగా ఫీలయ్యాము. ఈరోజు సినిమా పాజిటివ్ టాక్ రావడంతో, లాస్ట్ హాఫ్ ఆన్ అవర్ ఎక్స్ట్రార్డినరీ అన్నమాట వినపడడంతో.. ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నాం. నానికి ఓవర్సీస్ సెంటర్ హైయెస్ట్ గ్రాస్ తో రికార్డు సొంతం చేసుకోనుంది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఏ సినిమా నైనా ఆదరిస్తారని హిట్ 3 ద్వారా నిరూపించారు. ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీసే బాధ్యత ఇక నాపై ఉంది అని దిల్ రాజు తెలిపారు. ప్రెస్ మీట్ లో నానికి, చిత్ర యూనిట్ కి దిల్ రాజు థాంక్స్ చెప్పారు.


ఓ హాలీవుడ్ సినిమా.. ప్రేక్షకులకు అందించాడు. 

హిట్ సిరీస్ లో భాగంగా వచ్చిన హిట్ 3 బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా వాల్పోస్టర్ బ్యానర్ పై మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా కథ మొత్తం అర్జున్ సర్కార్ ఇన్వెస్టిగేషన్ మీదే సాగుతుంది. ఒక హత్య కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్లిన పోలీస్ ఆఫీసుకి అదే తరహాలో మరికొన్ని హత్యలు సీరియల్ కిల్లర్ చేస్తున్నాడు అని తెలుసుకొని, అతడిని పట్టుకునే క్రమంలో అర్జున్ సర్కార్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. కేసును ఎలా చేధించాడు అనేది తెలియాలంటే సినిమాని వెండితెరపై చూడాల్సిందే.. హిట్ ఫ్రాంచైజ్సీలో వచ్చిన తొలి రెండు భాగాలు ప్రేక్షకులు ఇన్వెస్టికేషన్లో భాగంగానే ఉంటాయి. ఇక మూడో కేసుగా వచ్చిన నాని హిట్ 3 ఓ హాలీవుడ్ సినిమాని చూస్తున్నామన్న ఫీలింగ్ ని నాని ప్రేక్షకులకు అందించాడు. క్రైమ్ థ్రిల్లర్ అనుభూతిని అభిమానులకు పంచారు. మూవీ కలెక్షన్స్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Balakrishna : అఖండ 2 సెట్ లోనే మరో సినిమా ఫిక్స్.. స్క్రిప్ట్ మీ ఊహకే వదిలేస్తున్నా..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×