Plastic Ban Idli Making: ప్రజలు అత్యంత ఇష్టంగా తినే ఇడ్లీలో ప్లాస్టిక్ ఆనవాళ్లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. హోటళ్లలో ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని భావిస్తోంది కర్ణాటక ప్రభుత్వం. దీనివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు మాట. వివిధ హోటల్‌లో ఇడ్లీ నమానాలను పరీక్షించారు. అందరూ ప్లాస్టిక్ ఉపయోగించినట్టు తేలింది.
అసలేం జరిగింది?
దక్షిణాది రాష్ట్రాల ప్రజలు అతిగా ఇష్టపడే వాటిలో ఇడ్లీ ఒకటి. ఏ రాష్ట్రానికి గానీ, ఏ ప్రాంతానికి వెళ్లినా ఇడ్లీ ఉందా అని అడగడం సహజం. ఇడ్లీ తింటేనే టిఫిన్ చేశామన్న ఫీల్ కలుగుతుంది. ఇదే ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. దీంతో కర్ణాటక సర్కార్ అలర్ట్ అయ్యింది. కర్ణాటక వ్యాప్తంగా 52 హోటళ్లలో ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఇడ్లీలను తయారు చేయడానికి పాలిథిన్ షీట్లను ఉపయోగించినట్టు తేలింది. దాదాపుగా 250 రకాల ఇడ్లీ నమానాలను పరీక్షించారు. 52 నమూనాల్లో వస్త్రానికి బదులుగా ప్లాస్టిక్‌ను ఉపయోగించినట్టు కనుగొన్నారు. ఇదే విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు వెల్లడించారు. ఇడ్లీ తయారీలో ప్లాస్టిన్‌ను నిషేధిస్తామని, దీనిపై రేపోమాపో ఉత్తర్వులు ఇస్తామన్నారు.
ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
ఇడ్లీలను తయారీ చేయడానికి పెద్ద పాత్రలు లేదా మెషిన్ లను ఉపయోగిస్తారు. ఇడ్లీ ప్లేట్లపై తొలుత వస్త్రాన్ని వేస్తారు. అప్పుడు దానిపై ఇడ్లీ రుబ్బు వేస్తారు. ఇది నార్మల్‌గా ఇంట్లో, హోటల్‌లో జరిగే తయారీ విధానం. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది హోటల్ నిర్వహకులు క్లాత్ కు బదులు ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నారు. ఆ విధంగా చేయడం వల్ల క్యాన్సర్ కారకాలు ఇడ్లీలోకి చేరుతాయి.
ALSO READ: కేవలం చట్టాలతో మహిళలకు రక్షణ కల్పించలేం
పని వేగంగా కావడానికి సింపుల్ పద్దతిలో పాలిథిన్ షీట్లను వినియోగిస్తున్నారు. అంతేకాదు వేడి వేడి ఇడ్లీ ప్యాకింగ్ చేసినప్పుడు సైతం పాలిథిన్ షీట్లనే ఉపయోగిస్తున్నారు. ఇదే క్రమంలో కర్ణాటక వ్యాప్తంగా అధికారులు తనిఖీలు చేపట్టారు. 52 హోటళ్లు ఇడ్లీలను తయారీలో పాలిథిన్ షీట్లను ఉపయోగిస్తున్నారని తేలింది.
దాదాపుగా 250 రకాల ఇడ్లీ నమానాలను పరీక్షించారు. అందులో సంప్రదాయ వస్త్రానికి బదులుగా పాలిథిన్ షీట్ల ఉయోగించినట్టు తేలింది. ఇకపై ఇలాంటి పనులు చేయవద్దని మంత్రి సూచించారు. ఇడ్లీ తయారీలో ప్లాస్టిన్‌ను బ్యాన్ చేసేందుకు రేపో మాపో ఉత్తర్వులు ఇస్తామన్నారు మంత్రి దినేష్ గుండూరావు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
ఆరోగ్యంపై కర్ణాటక ఫోకస్
ఈ మధ్యకాలంలో కర్ణాటక ప్రభుత్వం ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ చూపుతోంది. కొన్నాళ్ల కిందట పానీపూరీలో కేన్సర్ కారక రసాయనాలు గుర్తించారు అక్కడి అధికారులు. పానీ పూరీతో ఇచ్చే వాటర్‌ను పరీక్షించారు. వాటిలో కృత్రిమ రంగులు వినియోగిస్తున్నట్లు తేలింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదం తప్పదని మీడియా నివేదికలు సైతం బయటకు వచ్చాయి. వార్తల నేపథ్యంలో చాలామంది పానీపూరికి దూరంగా ఉన్న సందర్భాలు లేకపోలేదు. తాజాగా ఇప్పుడు ఇడ్లీ వంతైంది.