BigTV English

Producer Naga Vamsi: తప్పు నాదే అంటూ ఒప్పుకున్న నాగ వంశీ.. దానిపై కూడా క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Producer Naga Vamsi: తప్పు నాదే అంటూ ఒప్పుకున్న నాగ వంశీ.. దానిపై కూడా క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Producer Naga Vamsi:నిర్మాత నాగ వంశీ (Naga Vamsi) ప్రస్తుతం తాను నిర్మిస్తున్న ‘ డాకు మహారాజ్’ (Daaku Maharaj) ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. రీసెంట్గా ఈయన బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో బాలయ్యతో కలిసి రచ్చ రచ్చ చేసిన సంగతి మనకు తెలిసిందే. ‘దేవర’ సినిమాతో హిట్ కొట్టిన నాగ వంశీ , మళ్లీ నందమూరి హీరో అయినటువంటి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ తో హిట్టు కొట్టాలి అని తెగ ఆసక్తి చూపిస్తున్నారు.అందుకే డాకు మహారాజ్ మూవీ కి సంబంధించి పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత నాగవంశీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెగా ఫ్యాన్స్ ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా.. చిరంజీవి నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. కానీ బాబీ డైరెక్షన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య మూవీ కంటే డాకూ మహారాజ్ బాగుంటుంది.డాకూ మహారాజ్ బెస్ట్ మూవీ అంటూ మాట్లాడారు. అయితే ఈయన మాటలపై మెగా ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యారు. దాంతో నాగ వంశీ పై ట్రోల్స్ చేశారు.


చిరంజీవి విషయంలో నేను చేసింది తప్పే..

అయితే తాజాగా తప్పు తెలుసుకున్న నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తప్పంతా నాదే.. నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. వాల్తేరు వీరయ్య సినిమాతో పోల్చకుండా ఉండాల్సింది. బాబీ సినీ కెరీర్లో ది బెస్ట్ మూవీ డాకూ మహారాజ్ అంటే సరిపోయేది. కానీ చిరంజీవి మూవీ తో పోల్చడం నా తప్పే.. అయితే మీడియా వాళ్ళు ప్రశ్నలు అడిగేసరికి అలా చెప్పాల్సి వచ్చింది. తప్పంతా నాదే అంటూ నాగ వంశీ చెప్పుకొచ్చారు.


ఎన్టీఆర్ గురించి బాలయ్య మాట్లాడారు..

దీనికి తోడు అన్ స్టాపబుల్ షోలో ఎన్టీఆర్ గురించి బాలకృష్ణ కావాలనే మాట్లాడలేదు అని ఆయనపై సోషల్ మీడియాలో నెగటివిటీ వచ్చింది. కానీ ఈ వ్యాఖ్యలపై నాగ వంశీ మాట్లాడుతూ..షోలో మాట్లాడలేదు కానీ ఆఫ్ స్క్రీన్ లో ఎన్టీఆర్ గురించి బాలకృష్ణ మాట్లాడారు అని చెప్పారు.కానీ నాగవంశీ మాటల్ని ఎవరు పట్టించుకోవడం లేదు.షోలో మాట్లాడితే ఏమైనా కిరీటం కింద పడుతుందా? ఆఫ్ స్క్రీన్ లో మాట్లాడారంటే.. ఎవరు నమ్ముతారు? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

బాధ్యులు కాకపోయినా డబ్బులు ఇచ్చారు..

అలాగే గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూడడానికి వచ్చి వెళ్తున్న సమయంలో ఇద్దరు యువకులు చనిపోయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ విషయంలో స్పందించిన నాగ వంశీ.. వాళ్ళ చావుకు కారణం గేమ్ ఛేంజర్ ఈవెంట్ అంటున్నారు. కానీ వారి చావుతో రామ్ చరణ్ మూవీకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్లు ఈవెంట్ చూసి తిరిగి వెళ్లే సమయంలోనే రోడ్డు ప్రమాదంలో మరణించారు. గేమ్ ఛేంజర్ సినిమా వల్ల చనిపోకపోయినా.. వాళ్లు బాధ్యులు కాకపోయినా.. కూడా నిర్మాత దిల్ రాజు (Dilraju), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan),రామ్ చరణ్ (Ram Charan) ముగ్గురూ కూడా.. చనిపోయిన యువకుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. వారి తప్పు లేకపోయినా గొప్ప మనసుతో వాళ్ళు ఆదుకున్నారు. అక్కడ జరిగింది వేరు.. కానీ గేమ్ ఛేంజర్ మూవీపై విష ప్రచారం చేస్తున్నారు. అల్లు అర్జున్ విషయం ఇందులోకి లాగి కొంతమంది రాక్షసానందం పొందుతున్నారు. కానీ ఈ విషయంలో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు.రోడ్డు ప్రమాదంలో చనిపోతే దానికి టీం ఎలా కారణమవుతుంది? అంటూ నాగ వంశీ మాట్లాడారు.ఇక నాగ వంశీ మాటలను చాలామంది ఏకీభవిస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×