CSIR-CRRI Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఇంటర్ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. సీఎస్ఐఆర్- సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (సీఆర్ఆర్ఐ) లో పలు ఉద్యోగాలను నింపేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారు ఈ జాబ్ లకు దరఖాస్తు చేసుకోండి. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా లభించనుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
న్యూదిల్లీలోని సీఎస్‌ఐఆర్- సెంట్రల్ రోడ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీఆర్‌ఆర్‌ఐ).. కింది గ్రూప్ సి(నాన్ గేజిటెడ్)-జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 21 తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోండి.
మొత్తం పోస్టుల సంఖ్య: 209
సీఎస్‌ఐఆర్- సెంట్రల్ రోడ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీఆర్‌ఆర్‌ఐ) లో పలు రకాల పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
వెకెన్సీ వారీగా పోస్టులు చూస్తే..
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు: 177
జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు: 32
దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది:
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: ఏప్రిల్ 21
విద్యార్హత: సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత, టైపింగ్ స్కిల్స్, స్టెనోగ్రఫి వచ్చి ఉండాలి. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు 28 ఏళ్లు, జూనియర్ స్టెనోగ్రాఫర్‌కు 27 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు, ఎన్సీఎల్ అభ్యర్థులకు మూడేళ్లు వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్టెనోగ్రఫీ, టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు రూ.19,900-రూ.63,200; జూనియర్ స్టెనోగ్రాఫర్‌కు రూ.25,500- రూ.81,100 వేతనం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులు/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://crridom.gov.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు రూ.19,900-రూ.63,200; జూనియర్ స్టెనోగ్రాఫర్‌కు రూ.25,500- రూ.81,100 వేతనం ఉంటుంది.
నోటిఫికేసన్ ముఖ్య సమాచారం:
మొత్తం వెకెన్సీల సంఖ్య: 209
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 21
ALSO READ: BDL Recruitment: మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు భయ్యా..!
ALSO READ: BANK OF BARODA: భయ్యా ఈ జాబ్ గిట్ల వస్తే జీతం రూ.28,00,000.. డిగ్రీ పాసైతే మీరు అప్లై చేసుకోవచ్చు..