Hyderabad: భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు, ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వాతావరణ నెలకొంది. దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాయి. అయినా ఎక్కడో ఏదో చిన్న అలజడి. దేశ వ్యాప్తంగా అప్రమత్తం అయ్యింది మోదీ సర్కార్. కీలక కంపెనీల భద్రత విషయంలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
హైదరాబాద్ లింగంపల్లిలో ఉన్న బీహెచ్ఈఎల్- BHEL కంపెనీకి టైమింగ్స్ వేళను మార్చింది. అంతేకాదు కీలక మార్పులు చేసింది. ఒకప్పుడు నిరంతరం తెరిచే ఉంటే మెయిన్ గేట్లను మూసి వేస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. BHEL కంపెనీ చుట్టూ దాదాపు తొమ్మిది వరకు గేట్లు ఉన్నాయి. ఆయా గేట్ల నుంచి కంపెనీ ఉద్యోగులు, స్థానిక ప్రజలు రాకపోకలు సాగించేవారు. ఇకపై రాకపోకలపై ఆంక్షలు విధించింది బీహెచ్ఈఎల్.
బీహెచ్ఈఎల్ గేట్ల మూసివేత మే 9 (శుక్రవారం) నుంచి అమలులోకి రానుంది. అయితే గేట్లు మూసివేత వెనుక సెక్కూరిటీ కారణాల వల్ల మూసివేయాల్సి వచ్చిందని ఆ కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గేట్ల మూసి వేత సమయం ఈ విధంగా ఉన్నాయి.
మెయిన్ చెక్ పోస్ట్ గేటు – రాత్రి 11.30 నుంచి ఉదయం 5.00 గంటల వరకు మూసి వేయనున్నారు.
ALSO READ: భారత్-పాక్ సరిహద్దుల్లో టెన్షన్, ప్రజలను హెచ్చరించిన సజ్జనార్
శ్రీనివాస్ థియేటర్ గేటు- సెక్యూరిటీ కారణాల వల్ల మూసి వేస్తున్నట్లు తెలిపారు
HIG సుందరవనం పార్కు గేటు- ఓపెన్ చేసి ఉంటుంది.
HIG- ZPHS గేటు – ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు, సాయత్రం 5.30 నుంచి ఉదయం 5.30 వరకు మూసి వేయబడును.
ఎల్‌ఐజీ- LIG గేటు- ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు, సాయత్రం 5.30 నుంచి ఉదయం 5.30 వరకు మూసివేత
MAC సొసైటీ రోడ్ గేటు – పూర్తిగా మూసి వేయబడును
CISF బ్యారక్ రోడ్ గేటు- దీన్ని సీఐఎస్ఎఫ్ నిర్వహిస్తోంది. దీన్ని కూడా పూర్తిగా మూసి వేయబడును
MIG-నెహ్రూ పార్క్ రోడ్ గేటు- ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు, సాయత్రం 5.30 నుంచి ఉదయం 5.30 వరకు మూసి వేత
MIG-బుధవారం మార్కెట్ రోడ్ గేటు- సెక్యూరిటీ కారణాల వల్ల పూర్తిగా మూసి వేయబడింది
అంబులెన్స్, ఫైర్ర సర్వీస్ వంటి ఎమర్జెన్సీ సేవలకు అనుమతి ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది.