VD 12 Title : ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన కెరీర్ లో 12వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా ఈ సినిమా నుంచి విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇకపోతే విజయ్ ని చాలామంది దర్శకులు చాలా రకాలుగా చూపించారు కానీ ఇప్పుడు గౌతమ్ చూపించిన విధానానికి మాత్రం అందరూ స్టన్ అయిపోయారు అని చెప్పొచ్చు. సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఈ సినిమా ఫస్ట్ లుక్ పైన అప్పట్లో రియాక్ట్ అయ్యాడు. విజయ్ ను ఇలా చూడటం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఇకపోతే ఈ సినిమాకి ఇప్పటివరకు టైటిల్ ను ఖరారు చేయలేదు. చాలామంది విజయ్ దేవరకొండ ఫ్రెండ్స్ ట్విట్టర్ వేదిక ఎన్నో కామెంట్స్ చేశారు. ట్రోల్స్ కూడా చేశారు. వాస్తవంగా మాట్లాడాలంటే అబ్యూజ్ కూడా చేశారు. వీటన్నిటికీ ఇప్పుడు నిర్మాత నాగ వంశీ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. కొద్దిసేపటి క్రితమే నిర్మాత నాగ వంశీ మీ అందరి అబ్యూజ్ తర్వాత, నేను గౌతమ్ ని చాలా హింస పెట్టిన తర్వాత ఫైనల్లీ వీ లాక్డ్ టైటిల్ అంటూ ట్విట్ చేశాడు. మొత్తానికి విజయ్ దేవరకొండ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేసి లాక్ చేసినట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. దీనిని ఫిబ్రవరి 7న అధికారికంగా ఏం టైటిల్ పెట్టారు అని చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా అప్పుడే వచ్చే అవకాశం ఉంది.
ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విజయ్ రెండు పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఒకటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలోనూ, రెండు ఖైదీ పాత్రలో కూడా కనిపించనున్నాడు. అప్పట్లో రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే, ఖైదీ డ్రెస్ లోను మనం విజయ్ ను గమనించవచ్చు. అలానే ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు ఫస్ట్ పోలీస్ గెటప్ లో విజయ్ ను చూపించారు. ఏదేమైనా టు గెటప్స్ లో విజయ్ ని చూపించడం అంటే మామూలు విషయం కాదు. దీనిని బట్టి ఖచ్చితంగా గౌతమ్ ఒక బ్లాక్ బస్టర్ రెడీ చేయబోతున్నాడని అర్థమవుతుంది.
లేకపోతే రీసెంట్ టైమ్స్ లో విజయ్ హిట్ సినిమా చూసి చాలా రోజులైంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన ఖుషి, పరశురాం దర్శకత్వంలో చేసిన ఫ్యామిలీ స్టార్ ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలిపోయాయి. వరుస డిజాస్టర్లు చూస్తున్న విజయ్ పర్ఫెక్ట్ గా తన కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. వరుసుగా యంగ్ డైరెక్టర్స్ తో చేతులు కలుపుతూ అద్భుతమైన ప్రోజెక్ట్స్ ను తన లైనప్ లో పెట్టాడు. తర్వాత రాబోయే సినిమాలన్నిటి పైన కూడా మంచి అంచనాలు మొదలయ్యాయి. ఇక VD12 సంబంధించి షూటింగ్ కూడా ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఈ సినిమాకి సంబంధించి అనిరుద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బట్టి సినిమా విడుదల డిపెండ్ అయి ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు కానీ ఆ డేట్ కి సినిమా వస్తుందా లేదా అనేది ఇంకా గ్యారెంటీ లేదు.
Also Read : Sai Pallavi: సాయి పల్లవి ప్రత్యేకత ఇదే