SI Suicide: తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో ఉన్నతాధికారులు వీఆర్ కు పంపించారు. ఇవాళ ఉదయం స్టేషన్ కు వెళ్లిన ఆయన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్ఐ ఆత్మహత్య కలకలం రేపుతోంది. శుక్రవారం ఉదయం తణుకు రూరల్ పోలీస్టేషన్ లో రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇటీవల ఎస్ఐపై పలు అవినీత ఆరోపణలు రావడంతో అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. ఈ తరుణంలో ఆత్మహత్యకు పాల్పిడినట్లు తెలుస్తోంది. ఏజీఎస్ మూర్తి తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. తనపై అవినీతి ఆరోపణలు రావడంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు సమాచారం. దీంతో శుక్రవారం మార్నింగ్ పోలీస్టేషన్‌కు వచ్చిన మూర్తి.. తోటి పోలీసులు చూస్తుండగానే.. తుపాకీతో కాల్చుకున్నారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఎస్ఐ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మూర్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న అతన్ని కుంటుబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడకపోయిన సస్పెండ్‌కు గురవడంతో తమ కుమారుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని తల్లిదండ్రులు వాపోతున్నారు. అయితే ఎస్ఐ మూర్తి ఆత్మహత్య జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: సైబర్ నేరస్తులతో బ్యాంక్ అధికారులు కుమ్మక్కు.. కోట్లు దోపిడీ.. నకిలీ ఖాతాల గేమ్
ఇదిలా ఉంటే.. ఫైనాన్స్ కంపెనీ వేధింపులకు ఆటోడ్రైవర్ బలి అయ్యాడు. ఫేస్‌బుక్‌లో సూసైడ్ నోట్ పోస్టు చేసి సత్తిబాబు అనే డ్రైవర్ సూసైడ్ చేసుకున్నాడు. కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. విస్తార్ ఆటో ఫైనాన్స్ కంపెనీలో 7 లక్షల 80 వేల లోన్ తీసుకున్న సత్తిబాబు ఈ నెల EMi చెల్లించలేదు. తన భార్యకు హెల్త్ ఇష్యూస్ రావడం వల్లే లేట్ అయిందని కంపెనీ ప్రతినిధులకు చెప్పినప్పటికి వినలేదు. ఇంటిని తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నారని.. ఈ నెల 28న ఇంటి గోడకు నోటీస్ అంటించారు. అంతటితో ఆగకుండా ఆటో స్టాండ్‌కు వెళ్లి విస్తార్ కంపెనీ ప్రతినిధులు నానాయాగీ చేశారు. తన చావుకు విస్తార్ కంపెనీ ప్రతినిధులే కారణమని సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. భార్య, ఇద్దరు పిల్లలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.\