Tollywood:ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినీ సెలెబ్రిటీల మరణాలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కొంతమంది కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. మరి కొంతమంది అనారోగ్య సమస్యల కారణంగా స్వర్గస్తులవుతున్నారు. ఇంకొంతమంది వృద్ధాప్య రీత్యా తనువు చాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న ఒకరు తుది శ్వాస విడిచారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ నిర్మాత వేదరాజు టింబర్(Vedaraju Timber). గత కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న ఆయన గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ.. ఈరోజు తెల్లవారుజామున స్వర్గస్తులయ్యారు. ఈ విషయం తెలిసి అటు సినీ పరిశ్రమ ఇటు అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నిర్మాత వేదరాజు
నిర్మాత వేదరాజు టింబర్ సినీ జీవితం..
చదువు పూర్తయిన వెంటనే కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తూ సినిమా రంగంలోకి అడుగు పెట్టారు వేదరాజు టింబర్. అలా మొదటిసారి అల్లరి నరేష్ (Allari Naresh) తో ‘మడతకాజా’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. 2011లో విడుదలైన కామెడీ చిత్రమిది. ఈ చిత్రానికి దంతులూరు సీతారామరాజు దర్శకత్వం వహించగా.. టింబూ ప్రొడక్షన్స్, శ్రీ రంజిత్ మూవీస్ పతాకాలపై వేదరాజు టింబర్ నిర్మించారు. ఇందులో అల్లరి నరేష్, స్నేహ ఉల్లాల్(Sneha ullal) ప్రధాన పాత్రలో నటించగా. 2011 సెప్టెంబర్ 29న విడుదలైంది. ఈ సినిమాను తర్వాత హిందీలోకి ‘మేర ప్యార్’ పేరుతో 2018లో డబ్బింగ్ చేశారు. ఈ సినిమా విజయం సాధించడంతో ‘సంఘర్షణ’ సినిమా తీశారు. కానీ ఈ సంఘర్షణ సినిమా మాత్రం పరాజయం పాలైంది. ఆ తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరమయ్యారు వేదరాజు. ఇక 2021లో హీరో శ్రీ విష్ణు (Sree vishnu)తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇక ఆ సినిమా అనౌన్స్మెంట్ చేయకముందే ఈయన తుది శ్వాస విడిచారు. 54 సంవత్సరాల వయసున్న వేదరాజు హైదరాబాదులోని ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. త్వరగా కోలుకొని ఇంటికి వస్తారని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన మరణించడం అందరిని మరింత బాధకు గురిచేస్తోంది.
నేడే అంత్యక్రియలు..
ఇకపోతే ఈ విషయం టాలీవుడ్ లో విషాదాన్ని మిగిల్చింది పలువురు శని ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఆయనకు భార్య కుమార్తె ఉన్నారు వేదరాజు టింబర్ అంతక్రియలు కూడా ఈ రోజే జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఏది ఏమైనా ఒక గొప్ప నిర్మాత అనారోగ్య సమస్యలతో మరణించడం నిజంగా బాధాకరమని పలువురు నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.టింబర్ ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ ఉండడం గమనార్హం.