BigTV English

Naga Vamsi: అన్నను చూస్తే ముచ్చటేస్తుంది.. జాన్వీని చూస్తే ముద్దొస్తుంది

Naga Vamsi: అన్నను చూస్తే ముచ్చటేస్తుంది.. జాన్వీని చూస్తే ముద్దొస్తుంది

Naga Vamsi: చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు… ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దేవర సెకండ్ సింగిల్ కోసం ఎంతగానో ఎదురుచూసిన అభిమానులకు మేకర్స్ మంచి ట్రీట్ నే అందించారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర.


ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను నిర్మాత సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇక నాగవంశీ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో యాక్టివ్ గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దేవర సెకండ్ సింగిల్ పై సగానికి పైగా హైప్ తీసుకొచ్చింది అంటే నాగవంశీనే అని చెప్పాలి. అరవింద సమేత తరువాత ఎన్టీఆర్ క్యూట్ రొమాన్స్.. ఈ సాంగ్ లో ఉంటుందని, దాని కోసం అభిమానులతో పాటు తాను ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇక సాంగ్ కూడా నాగవంశీ చెప్పినదానికి ఏ మాత్రం తీసిపోలేదు. ఎన్టీఆర్ యాక్షన్ మోడ్ లో చూసి చూసి ఉన్న ప్రేక్షకులకు ఈ సాంగ్ కొంత ఉపశమనం ఇస్తుంది.


జాన్వీ అందాలు, ఎన్టీఆర్ లుక్, చిన్న చిన్న స్టెప్స్ అదరకొట్టారు. అయితే సాంగ్ మాత్రం కాపీ ఆరోపణలను ఎదుర్కుంటున్న విషయం తెల్సిందే. మూడేళ్ళ క్రితం రిలీజ్ అయిన ఒక హిట్ సాంగ్ కు కాపీ అని ట్రోలర్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ కామెంట్స్ పై నాగవంశీ తనదైన రీతిలో సమాధానం చెప్పుకొచ్చాడు.

” చుట్టమల్లే సాంగ్ గత 24 గంటల నుండి లూప్‌లో ఉంది. జోష్ ఎలా ఉంది బాయ్స్. తారక్ అన్నని చూస్తుంటే ముచ్చటేస్తుంది, జాన్వీని చూస్తుంటే ముద్దు వస్తుంది. ఇంక ఎవరు ఎలా అనుకోని, దేంతో కంపేర్ చేస్తే మనకేంటి కదా బాయ్స్” అని రాసుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ సైతం నువ్వు ఏది అంటే అదే అన్నా.. సాంగ్ మాత్రం అదిరిపోయింది అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×