BigTV English

Rocky Avenues: బోర్డు తిప్పేసిన రాకీ అవెన్యూస్‌.. సుమ కనకాలకి బాధ్యత లేదా?

Rocky Avenues: బోర్డు తిప్పేసిన రాకీ అవెన్యూస్‌.. సుమ కనకాలకి బాధ్యత లేదా?

Rocky Avenues cheated customers: ఫేజ్ వన్ ఫ్లాట్లన్నీ అమ్ముడుపోయాయి. ఇప్పుడు 18 లక్షలకే సెకండ్ ఫేజ్ లో ఫ్లాట్. త్వరపడండి ఉగాది సందర్భంగా కంపెనీయే రిజిస్ట్రేషన్ ఫీజు భరిస్తుంది. పైగా జీఎస్టీ కూడా కట్టనవసరం లేదు. ఇది ప్రముఖ టీవీ యాంకర్ సుమ కనకాల.. రాకీ అవెన్యూస్ కు ప్రచారం చేస్తూ చెప్పిన మాటలివి. రాజమండ్రిలో రాకీ అవెన్యూస్‌ బోర్డు తిప్పేయడంతో.. వందలాది మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడ్డాయి.


ఫేజ్ వన్ ప్రాజెక్టు యాడ్స్ లో అయితే సుమతో పాటు రాజీవ్ కనకాల కూడా నటించారు. ఆ తర్వాత ఫేజ్ టులో సుమతో పాటు ఇతర నటీనటులు రాకీ అవెన్యూస్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. చవకగా ఇళ్లంటూ ఊదరగొట్టారు. సుమ మధ్యతరగతి కుటుంబాల్లో ఫ్యాన్ బేస్ చాలానే ఉంది. అందుకే సుమ చెప్పిందంటూ రాకీ అవెన్యూస్‌లో జనం భారీగా ఫ్లాట్లు కొన్నారు. తీరా ఇప్పుడు.. ఫ్లాట్లు అప్పగించకుండానే ఆ సంస్థ ప్యాకప్ చెప్పింది. దాంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు రోడ్డెక్కారు.

Also Read: అమ్మకానికి TTD దర్శన సిఫారసు లేఖలు.. వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పై కేసు


ఫ్లాట్లు కొనుక్కొండి.. త్వరపడండి అంటూ అడ్వర్టైజ్మెంట్ చేసిన సుమ ఇప్పుడు బాధితులు రోడ్డెక్కితే అడ్రస్ లేరు. బాధితుల విషయంలో సుమ ఎందుకు స్పందించలేదు. ఫ్లాట్లు కొనాలంటూ చెప్పిన సుమకు, కస్టమర్లకు అండగా నిలవాల్సిన బాధ్యత లేదా..? కేవలం రెమ్యునరేషన్ తీసుకుంటే చాలా..? జనం నిండా మునిగినా పర్వాలేదా..? అనే ప్రశ్నలను సుమ సమాధానం చెప్పాలంటున్నారు పబ్లిక్.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×