BigTV English
Advertisement

SKN : పర్సంటేజ్ తర్వాత పల్స్ కాపాడిండి.. ఎగ్జిబిటర్ల వివాదంపై నిర్మాత ఎస్ కె ఎన్ వ్యాఖ్యలు

SKN : పర్సంటేజ్ తర్వాత పల్స్ కాపాడిండి.. ఎగ్జిబిటర్ల వివాదంపై నిర్మాత ఎస్ కె ఎన్ వ్యాఖ్యలు

SKN : గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో సినిమా ధియేటర్ల వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ వివాదంపై నిర్మాత శ్రీనివాస్ కుమార్ (SKN ) స్పందించారు. తాజాగా నిఖిల్ దేవాదుల హీరోగా నటిస్తున్న ఘటికాచలం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. అందులో భాగంగా విలేకరులు అడిగే ప్రశ్నకు SKN సమాధానం ఇచ్చారు. ఈ వివాదంపై మీరేమంటారు అని విలేకరి అడిగిన ప్రశ్నకు.. SKN అని తనదైన శైలిలో ఇండ్రస్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయన ఏమన్నారో చూద్దాం ..


పర్సంటేజ్ తర్వాత పల్స్ కాపాడిండి..అసలే ఇండస్ట్రీ ఐసీయూలో ఉంది..

SKN మాట్లాడుతూ.. ఇండ్రస్ట్రీ లో వివాదం గురించి సినీ పెద్దలు ఆలోచించాలి. ఇండస్ట్రీ ఇప్పటికే ఐసీయూలో ఉంది. ఇప్పుడు యాంటీ బయోటిక్స్ ఇస్తున్నాం.. ఇక మందులు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. పర్సంటేజీల విధానంపై కాకుండా, నన్ను అడిగితే థియేటర్లో ప్రేక్షకులను పెంచే ఆలోచన విధానాలు సినీ పెద్దలు చేయాలి. టికెట్లు ధరలు, ఓటీటీల వల్ల అభిమానులు థియేటర్లకు దూరం అవుతున్నారు. దీన్ని ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి. మార్నింగ్ షో కి వచ్చే అభిమానులు పూర్తిగా తగ్గిపోతున్నారు. ఇలా ఆడియన్స్ ఎందుకు తగ్గుతున్నారో సినీ పెద్దలు ఆలోచించాలి. టికెట్టు ధరలను కూడా తగ్గించే విషయంపై సినీ పెద్దలు ఓ నిర్ణయం తీసుకోవాలి. మామూలు రోజుల్లో టికెట్ ధరలు తగ్గించడం, వీకెండ్స్ లో ధరలు పెంచడం అనే ఆలోచన చేస్తే, థియేటర్లకు అభిమానులు సంఖ్య పెంచుకోవచ్చు. ఆడియన్స్ థియేటర్ కి రావడానికి ఆసక్తి చూపడం లేదు, అది ఎందుకు అన్నది ఆలోచించాలి రెండు వారాల్లో మూవీ ఓటీటీ లోకి వస్తుంది. అలాంటప్పుడు ఎందుకు వెళ్లాలి అని సగటు అభిమానులు అనుకుంటున్నారు. ఇప్పుడు హిందీ, తమిళంలో జరుగుతున్నట్టు తెలుగు లోను సినిమా రిలీజ్ అయిన తరువాత వెంటనే ఓటీటీ లోకి రిలీజ్ చేయకుండా ఎనిమిది వారాల తర్వాతే వచ్చేలా ఏర్పాటు చేయాలి. ఇలా ప్రతి విషయంపై చర్చ జరగాలి అని ఎస్ కే ఎన్ తన అభిప్రాయాన్ని మీడియాతో తెలిపారు.


ఎగ్జిబిటర్ల వివాదం..

గత కొంతకాలంగా థియేటర్ల ఎగ్జిబిటర్లు వివాదం జరుగుతూ ఉంది. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఎగ్జిబిటర్లు చెప్పిన సంగతి తెలిసిందే, అద్దె ప్రతిపాదన విధానాన్ని రద్దు చేయాలని, ఈ ప్రతిపాదనలో సినిమాలని వేస్తుండడంతో వారికి ఆదాయం సరిపోవడంలేదని, మల్టీప్లెక్స్ తరహాలో వసూళ్లలో పర్సంటేజ్ విధానాన్ని తమకు అమలు చేయాలంటూ థియేటర్లో యాజమాన్యం పట్టుబడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ వివాదం కొంత ఆగిన, పూర్తి గా సమస్య పరిష్కారం అవ్వలేదు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×