BigTV English

Telugu Movie : ఖర్చు తగ్గించండి… మూవీ యూనిట్‌కి నిర్మాతలు షాకింగ్ ఆదేశాలు..?

Telugu Movie : ఖర్చు తగ్గించండి… మూవీ యూనిట్‌కి నిర్మాతలు షాకింగ్ ఆదేశాలు..?

Telugu Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అదో పెద్ద నిర్మాణ సంస్థ. సినిమాలకు కొదవ లేదు. కలెక్షన్లు రాలేవు అనే భాద లేదు. అయినా… ఓ సినిమా నిర్మాణం విషయంలో ఆంక్షలు పెడుతుందట. “ఇప్పటికే చాలా చేశారు. ఇక చాలు… ఖర్చు తగ్గించండి” అంటూ అల్టిమేటం జారీ చేసిందట. దీనికి కారణం హీరోనే తెలుస్తుంది. ఆ హీరోకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది. వరుస డిజాస్టర్లు. దీంతో ఉన్న మార్కెట్ మొత్తం పోయింది. దీన్ని గుర్తించిన నిర్మాతలు… ఆ హీరోకు పెట్టింది చాలు… బడ్జెట్ ఇక తగ్గించండి అంటూ మూవీ టీంని ఆదేశించారట.


ఇంతకి అలాంటి ఆదేశాలు ఇచ్చిన నిర్మాతలు ఎవరు..?
ఆ సినిమా ఏంటి..?
బ్యాడ్ టైం ఎదుర్కొంటున్న హీరో ఎవరు..?
అనేది ఇప్పుడు చూద్ధాం…

యంగ్ హీరో… గత 6 ఏళ్ల నుంచి హిట్స్ లేవు. గతేడాది ఓ సినిమా చేశాడు. భారీ హైప్, అంతకు మంచి భారీ బడ్జెట్‌తో వచ్చిన ఆ మూవీ బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడింది. కోట్లల్లో నష్టం వచ్చింది. దీంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.


బడ్జెట్ తగ్గింపు…

అలా… ఓ డైరెక్టర్‌తో సినిమా చేస్తున్నాడు. ఆ డైరెక్టర్ గత చిత్రం ఓ సీనియర్ హీరోయిన్‌తో చేశాడు. అది హిట్ అయింది. ఇప్పుడు ఈ యంగ్ హీరోతో మూవీ చేస్తున్నాడు. దీనికి దాదాపుగా 70 నుంచి 80 కోట్ల బడ్జెట్ కేటాయించారట నిర్మాతలు.

కానీ, ఇప్పుడు ఆలోచిస్తున్నారట. వరుస డిజాస్టర్ల హీరో. మార్కెట్ మొత్తం పడిపోయింది. ఇప్పుడు ఇన్ని కోట్లు పెట్టడం రిస్క్ తో కూడిన పని అనుకున్నరట. అందుకే బడ్జెట్ తగ్గించాలని డైరెక్టర్ తో పాటు మూవీ టీంకి చెప్పారట.

ఆ సీనియర్ నటుడు వద్దు..?

అలాగే ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ ఉంటుందట. దానికి చాలా వెయిటేజ్ ఉంటుందని సమాచారం. దాని కోసం ఓ పాన్ ఇండియా నటుడిని సంప్రదించారట. కథ కూడా చెప్పారట. అయితే ఆ ఇతర భాష ఇండస్ట్రీకి చెందిన పాన్ ఇండియా స్టార్ ఈ మూవీని హోల్డ్‌లో పెట్టారట.

ఇదే మంచి పని…

ఆ పరభాష పాన్ ఇండియా నటుడు హోల్డ్ పెట్టడంతో… ఇదే మంచింది అనుకున్నారట నిర్మాతలు. ఆ పాన్ ఇండియా నటుడు కాకుండా… ఇక్కడ తెలుగులో ఉండే సీనియర్ నటుడిని తీసుకోవాలని సూచించరట. రెమ్యునరేషన్ ఎక్కువ కాకుండా… తక్కువలో ఉండేే నటుడు అయితే బెటర్ అని కూడా చెప్పినట్టు సమాచారం.

ఫాస్ట్‌గా కంప్లీట్ చేయండి…?

అలాగే.. సినిమాకు ఇప్పటికే బడ్జెట్ ఎక్కువ అయిందని, తక్కువ ఖర్చులో ఫాస్ట్ గా షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. దీంతో ఇటీవల ఆ యంగ్ హీరోతో కొత్త షెడ్యూల్ కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.

ఇప్పటికే వరుస డిజాస్టర్లతో ఉన్న హీరోకు ఇప్పుడు బడ్జెట్ కష్టాలు రావడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదట. మంచి సినిమా వస్తే.. కంబ్యాక్ ఇస్తానని అనుకుంటున్న ఆ హీరోకు నిర్మాతల నిర్ణయం శాపంగా మారిందని వాపోతున్నారు అభిమానులు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×