Dragon Fruit Benefits: ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలంటే.. మనం చాలా విషయాలపై శ్రద్ధ వహించాలి. సమయానికి నిద్రపోయి మేల్కొనడం, పోషకాహారం తీసుకోవడం, దీంతో పాటు సీజనల్ ఫ్రూట్స్ తినడం. పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ కొన్ని రకాల ఫ్రూట్స్ ను తినడానికి చాలా మంది ఇష్టపడరు. వాటిలో డ్రాగన్ ఫ్రూట్ కూడా ఒకటి. కానీ డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. కొన్ని రకాల వ్యాధులను తగ్గించడంలో కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
రోగనిరోధక శక్తి:
డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి దీనిని తినడం మంచిదని చెబుతుంటారు. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మది చేయడంలో డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిని తినడం ద్వారా.. మన చర్మం చాలా ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటుంది. విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఈ పండు చర్మానికి, ఆరోగ్యానికి రెండింటికీ మేలు చేస్తుంది. ఒక డ్రాగన్ ఫ్రూట్‌లో దాదాపు 60 కేలరీలు , 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇందులో విటమిన్ సి, ఎ, మెగ్నీషియం, ఐరన్ , కాల్షియం వంటి పోషకాలు కూడా ఉన్నాయి. దీనిని తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.
గుండెకు మంచిది:
మన శరీరంలో గుండె అతి ముఖ్యమైన భాగం. గుండె ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. మీ గుండె బాగా పనిచేస్తుంటే మీరు మంచి జీవనశైలిని గడుపుతున్నారని అర్థం. డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మన శరీరం సజావుగా పనిచేయడానికి సహాయపడతాయి. దీని వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఒమేగా 3, 6 కొవ్వు ఆమ్లాలు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండెపోటు, వ్యాధులు రాకుండా ఉంటాయి.
షుగర్ పేషెంట్లకు మంచిది:
డ్రాగన్ ఫ్రూట్ యొక్క గ్లైసెమిక్ సూచిక అరటిపండు కంటే కూడా తక్కువగా ఉంటుంది. అందుకే.. షుగర్ పేషెంట్లు దీనిని తినవచ్చు. ఇందులో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. అంతే కాకుండా ఈ పండు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండు ప్రీడయాబెటిస్ , టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు.
కొలెస్ట్రాల్ పెరుగుదల:
శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె జబ్బులు వస్తాయి. ఈ పండు తినడం వల్ల మన శరీరంలో ఉండే చెడు కొవ్వు తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ విధంగా.. మంచి కొవ్వును పెంచడం ద్వారా , కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడం ద్వారా.. డ్రాగన్ ఫ్రూట్ మన శరీరానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
క్రోటిన్ :
డ్రాగన్ ఫ్రూట్‌లో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. ఇందులో క్రోటీన్ అనే మూలకం కూడా ఉంటుంది. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలతో నిండి ఉంది. ఇది శరీరంలో ఏర్పడే క్యాన్సర్ గడ్డలను తగ్గించడంలో సహాయపడుతుంది.
Also Read: ఫ్రూట్ ఫేస్ ప్యాక్.. ఇలా చేస్తే గ్లోయింగ్ స్కిన్ గ్యారంటీ
చర్మ సమస్యలు:
డ్రాగన్ ఫ్రూట్ చూడటానికి ఎంత అందంగా ఉంటుందో.. దాని లక్షణాలు కూడా అంతే బాగుంటాయి. ఇది మన చర్మాన్ని చాలా మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, సోడియం, విటమిన్ సి, ఫినోలిక్ ఆమ్లం వంటివి సమృద్ధిగా ఉండే ఈ పండు మన చర్మాన్ని అనేక రకాల నష్టాల నుండి రక్షిస్తుంది.