Prudhvi Raj: ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి నటీనటులుగా గుర్తింపు తెచ్చుకున్న చాలామంది ఇప్పుడు రాజకీయాల్లో సెటిల్ అయ్యారు. పూర్తిస్థాయిగా రాజకీయాల్లోకి వెళ్లిపోయిన నటీనటుల్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి రాజ్ కూడా ఒకరు. చాలాకాలంగా పవన్ కళ్యాణ్ సపోర్టర్‌గా, ఫాలోవర్‌గా పాలిటిక్స్‌లో బిజీ అయ్యారు పృధ్వి. వైసీపీపై ఎప్పటికప్పుడు కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేస్తూ అటు రాజకీయాల్లో, ఇటు సోషల్ మీడియాలో హైలెట్ అవుతూ ఉంటారు. దానివల్లే వైసీపీకి ఆయన టార్గెట్ కూడా అవుతుంటారు. అలా ఒక వైసీపీ ఫాలోవర్ ఆయనను టార్గెట్ చేసి మరీ ఆయన ఫోటోను ఎడిట్ చేసి శ్రద్ధాంజలి అని పోస్ట్ చేశాడు. దీంతో పృధ్వి కోపం కట్టలు తెంచుకుంది.
మిమ్మల్ని తిట్టాల్సిందే
తన ఫోటోకు శ్రద్ధాంజలి అని యాడ్ చేసిన వైసీపీ ఫాలోవర్‌కు ఓపెన్‌గా వార్నింగ్ ఇచ్చారు పృధ్వి రాజ్. ముందుగా ఆ ఫోటోను అందరికీ చూపించారు. ‘‘అందరికీ నమస్కారం. ఒకసారి ఈ ఫోటో చూడండి. వీడెవడో పవనానంద్ అంటా. అది కూడా వెటకారంగా వీడి భార్య పవనానంద్ అంటా. ఒరేయ్ యెదవ.. నేను తిట్టకూడదు అనుకుంటున్నాను కానీ మిమ్మల్ని తిట్టాల్సిందే. మీరు కడుపుకు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? కుక్క పెంట ఏమైనా తింటున్నారా?’’ అంటూ తన ఫోటోను అలా ఎడిట్ చేసిన వారిని బూతులు తిట్టడం మొదలుపెట్టాడు పృధ్వి రాజ్ (Prudhvi Raj). అంతే కాకుండా వారిని మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
కుక్కతో కూడా పోల్చను
‘‘ఒక ఫోటో పెట్టి భాష్పాంజలి, శ్రద్ధాంజలి అని ఘటించినంత మాత్రానా ప్రతీది జరగదు అని గుర్తుపెట్టుకోండి. ఇంకా మా ఆయుష్షు పెరుగుతుంది. ఒరేయ్ దరిద్రుల్లారా.. ఇలా మీ తల్లిదండ్రుల ఫోటో పెట్టుకోండ్రా. ఇలా బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ పెట్టి, ఫోటో పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు చాలా అజ్ఞానులు. మిమ్మల్ని కుక్క అని కూడా అనకూడదు. వాటికి విశ్వాసం ఉంది. మీకేం ఉంది.? దౌర్భాగ్యపు వెధవల్లారా. మీకు తగిన శాస్తి జరుగుతుంది. త్వరలోనే మీ ఇంటికి నోటీసు వస్తుంది. ఎదురుచూస్తూ ఉండండి’’ అంటూ ఈ విషయంపై తాను హర్ట్ అయ్యానని, కచ్చితంగా ఇంటికి నోటీసులు పంపిస్తానని క్లారిటీ ఇచ్చాడు పృధ్వి రాజ్.
Also Read: పులిలా ఉండే వర్మ.. పిల్లిలా మారిపోయాడు.. పవన్ మరీ ఇంతలా భయపెట్టాడా.?
వెంటనే రియాక్షన్
వైసీపీ నేతలకు పృధ్వి టార్గెట్ అవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. జనసేనకు సపోర్ట్ చేస్తూ, పవన్ కళ్యాణ్‌ను సపోర్ట్ చేస్తూ తరచుగా వైసీపీ నేతలపై ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు పృధ్వి. అందుకే వారు కూడా ఆయననే మెయిన్ టార్గెట్‌గా పెట్టుకుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో పృధ్విపై విపరీతంగా మీమ్స్, ట్రోల్స్ వస్తుంటాయి. అలాగే తాజాగా వైసీపీ ఫాలోవరో ఎవరో తనకు శ్రద్ధాంజలి అంటూ ఫోటో ఎడిట్ చేసి పోస్ట్ చేశాడు. అలా సోషల్ మీడియాలో తనపై ఎవరు, ఏది పోస్ట్ చేసినా చాలావరకు పృధ్వి వెంటనే రియాక్ట్ అవుతారు. అలా మరోసారి తన ఫోటో ఎడిట్ చేసిన వారిపై కూడా యాక్షన్ తీసుకుంటానని గట్టిగా చెప్పారు పృధ్వి రాజ్.
వెధవల్లారా బ్రతికుండగానే…చంపేశారు కదరా..#PrudhviRaj #ComedianPruthvi #30YearsIndustry #Tollywood #bigtvcinema pic.twitter.com/EQBBQD919i
— BIG TV Cinema (@BigtvCinema) March 12, 2025