
PS-2 movie : పొన్నియన్ సెల్వన్-2పై డైరెక్టర్ మణిరత్నం చేతులెత్తేసినట్టే. పీఎస్-1 ఫలితం చూశాక.. కేవలం తమిళ వర్షన్ కే పరిమితం అయితే బాగుంటుందని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. నిజానికి పొన్నియన్ సెల్వన్ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారు. ఫస్ట్ పార్ట్ ప్రొమోషన్ కూడా అదే రేంజ్‌లో జరిగింది. తమిళ్‌తో పాటు దక్షిణాది, ఉత్తరాది మొత్తం సినిమాను ఆదరిస్తారని పెద్ద ఆశలు పెట్టుకున్నారు. చివరికి తమిళనాడులో తప్ప ఎక్కడా గొప్పగా ఆడలేదు.
ఇప్పుడు పొన్నియన్ సెల్వన్-2పై ఒక్క తమిళనాడులో తప్ప ఎక్కడా ఎక్స్‌పెక్టేషన్సే లేవు. దీన్ని అసలు కొనే వాళ్లే లేరు. దీంతో పాన్ ఇండియా ప్రమోషన్ కూడా తగ్గించేశారు మణిరత్నం. అనవసరంగా ప్రమోషన్ కు ఖర్చు చేయడం, విలువైన కాలాన్ని వృథా చేసుకోవడం మినహా వచ్చేదేం లేదని అర్థమైపోయింది. అందుకే, ఇప్పటి వరకు పాన్ ఇండియా ప్రమోషనే మొదలుపెట్టలేదు. ఏదో.. పేరుకు మాత్రమే ఇతర భాషల్లో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.
రీసెంట్‌గా రిలీజ్ అయిన పొన్నియన్ సెల్వన్-2 ఇంట్రో వీడియో చూస్తే.. దర్శకుడు మణిరత్నం కొంత క్లారిటీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఈ వీడియోలో కమల్ హాసన్‌తో మాత్రమే వాయిస్ ఓవర్ చెప్పించారు. అంటే… తమిళ లాంగ్వేజ్‌కు, అక్కడి మార్కెట్‌కు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఒకవేళ పాన్ ఇండియా ప్రమోషన్ చేయాలనుకుంటే.. కమల్ హాసన్ వాయిస్‌తో పాటు మిగతా లాంగ్వేజ్‌లో కూడా రిలీజ్ అయి ఉండాలి. పోనీ, కమల్ హాసన్‌తోనే అన్ని భాషల్లో వాయిస్ ఓవర్ చెప్పించి ఉండాల్సింది. కమల్‌కు తెలుగు, కన్నడ, మలయాళంతో పాటు హిందీ కూడా వచ్చు. కాని, అలా జరగలేదంటే ఏంటి అర్థం. పొన్నియన్ సెల్వన్-2ను తమిళనాడులోనే మార్కెట్ చేసుకునే వ్యూహం కాదా.
అయినా.. ఈ సినిమాకు తమిళనాడులో పెద్దగా ప్రమోషన్ అక్కర్లేదు. బాహుబలి-1 చూసిన వాళ్లు కచ్చితంగా బాహుబలి-2 చూస్తారు. చూశారు కూడా. పొన్నియన్ సెల్వన్-1 చూసిన తమిళులు.. రెండో పార్ట్ కూడా చూస్తారు. పైగా తమిళ ప్రైడ్ సినిమా అది. అయినా సరే… తమిళంలోనే దీనికి బజ్ పెరిగే చేస్తున్నారు దర్శక నిర్మాతలు.