BigTV English

T20 World Cup 2024: ఆ ఐదుగురికి.. ఆఖరి టీ20 ప్రపంచకప్ ఇదేనా?

T20 World Cup 2024: ఆ ఐదుగురికి.. ఆఖరి టీ20 ప్రపంచకప్ ఇదేనా?

T20 World Cup 2024: ఐసీసీ టీ 20 ప్రపంచకప్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే ఇందులో ఐదుగురు సీనియర్లకి అవకాశం కల్పించింది. అయితే జట్టులో సీనియర్లేకాదు, వయసు పరంగా కూడా సీనియర్లు కావడంతో బహుశా ఇదే వారికి చివరి టీ 20 ప్రపంచ కప్ గా అందరూ అభివర్ణిస్తున్నారు. నెట్టింట ఇదే టాపిక్ వైరల్ గా మారింది. ఇంతకీ ఆ ఐదుగురు ఎవరా? అని చూస్తున్నారా? వారెవరో కాదండీ


అందరికీ తెలిసిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, ఇంకా రవీంద్ర జడేజా, అలాగే సూర్యకుమార్ యాదవ్, స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ఉన్నారు. అయితే వీరిలో కోహ్లీ, రోహిత్ శర్మ, జడ్డూ ముగ్గూరు 35 ఏళ్లు దాటేశారు. సూర్యకుమార్, చాహల్ ఇద్దరికి 33 ఏళ్లు వచ్చేశాయి. రెండేళ్లకి ఒకసారి జరిగే టీ 20 ప్రపంచకప్ లో 2027కి వీరికి అవకాశాలు ఉండవనే అంటున్నారు.

11 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న ఐసీసీ ట్రోఫీని అందుకోవడానికి వీళ్లు ఐదుగురు శతవిధాల ప్రయత్నిస్తారని అంటున్నారు. ఎందుకంటే ఇన్నేళ్లుగా విరాట్, రోహిత్ , రవీంద్ర జడేజా టీమ్ ఇండియాలో కీలకంగా ఉన్నారు. వీరికి కూడా ఒక జ్ణాపకం ఉండాలంటే ఈసారి టీ 20 ప్రపంచకప్ కొట్టాల్సిందే అంటున్నారు.


మహ్మద్ షమీ తిరిగి జట్టులోకి వస్తాడని అంతా ఎదురుచూశారు. అయితే తన కాలికైన శస్త్రచికిత్స నుంచి బహుశా కోలుకున్నట్టు లేదు. అంతర్జాతీయ స్థాయికి అతను శక్తి అందుకున్నట్టు లేదు. అందువల్లే తన పేరును పరిగణలోకి తీసుకోలేదు. పొట్టి ప్రపంచకప్ కోసమని ఇన్నాళ్లూ బీసీసీఐ ఎంతో ఎదురుచూసింది. కానీ తను ఫిట్ నెస్ నిరూపించుకోవడంలో బహుశా విఫలమైనట్టున్నాడు. అందుకనే తన పేరును పరిగణలోకి తీసుకోలేదు.

Also Read: టీ20 ప్రపంచ కప్.. ఆసీస్ జట్టు ఇదే.. కెప్టెన్

నిజానికి తన వయసు కూడా ప్రస్తుతం 33 ఏళ్లు.. ఈ లెక్కన చూస్తే షమీ కూడా 2027 పొట్టి ప్రపంచకప్ లో ఆడే అవకాశాలు లేవనే అంటున్నారు. నిజంగా ఇది దురదృష్టమని చెప్పాలి. ఎందుకంటే 2023 వన్డే ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా చరిత్ర సృష్టించిన షమీ ఇలా టీ 20 ప్రపంచకప్ లో ఆడకపోవడం విధి వైచిత్రి అనే చెప్పాలి.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×