BigTV English

Pushpa 2 : మల్లు అడ్డాపై అల్లు అర్జున్ సందడి… కేరళలో “పుష్ప 2” ఈవెంట్ ఎప్పుడంటే?

Pushpa 2 : మల్లు అడ్డాపై అల్లు అర్జున్ సందడి… కేరళలో “పుష్ప 2” ఈవెంట్ ఎప్పుడంటే?

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవెయిటింగ్ మూవీ “పుష్ప 2”. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే పాట్నా, చెన్నైలలో సినిమాకు సంబంధించిన ఈవెంట్స్ నిర్వహించగా, ఇప్పుడు పుష్ప రాజ్ మల్లు అడ్డా కేరళలో అడుగు పెట్టబోతున్నాడు. మరి అల్లు అర్జున్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్న కేరళలో “పుష్ప 2” ఈవెంట్ ఎప్పుడు జరగబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం “పుష్ప 2” మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉన్నారు. మొన్న పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్, నిన్న చెన్నైలో సాంగ్ లాంచ్ ఈవెంట్ తో వైల్డ్ ఫైర్ ఈవెంట్స్ నిర్వహించారు మేకర్స్. ఈ రెండు ఈవెంట్స్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. నెక్స్ట్ అల్లు అర్జున్ కు భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కేరళలో ఈవెంట్ నిర్వహించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల తర్వాత అల్లు అర్జున్ కు కేరళలోనే భారీ సంఖ్యలో ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాలు తెలుగులో ఎలా రిలీజ్ అవుతాయో అలా కేరళలో కూడా రెగ్యులర్ గా రిలీజ్ అవుతాయి. అక్కడ అందరూ అల్లు అర్జున్ ని మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు అన్న సంగతి తెలిసిందే. బన్నీకి టాలీవుడ్ లో మరే హీరోకి లేనివిధంగా కేరళలో ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేరళ ఈవెంట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.

అయితే కేరళ రాష్ట్రం కొచ్చిలో ఉన్న గ్రాండ్ హయత్ లో 27 వ తారీఖున సాయంత్రం “పుష్ప 2” ఈవెంట్ ను నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. నిజానికి బన్నీకి పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేని పాట్నా, చెన్నై నగరాల్లోనే భారీ ఈవెంట్ ను నిర్వహించగా, ఊహించనంత జనం తరలివచ్చారు. మరి ఇప్పుడు భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కేరళలో ఈవెంట్ అంటే అభిమానులు ఏ రేంజ్ లో తరలి వస్తారనే ఆసక్తి మొదలైంది. ఏదేమైనా సరే కేరళలో “పుష్ప 2” ఈవెంట్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు అల్లు అభిమానులు. రీసెంట్ గా ప్రెస్ మీట్ లో కేరళ డిస్ట్రిబ్యూటర్ మొదటి రోజు రోజంతా కేరళలో షోలు ఉండేలా ప్లాన్ చేస్తున్నామని గుడ్ న్యూస్ చెప్పారు. మరి ఈ మూవీ ఓపెనింగ్ అక్కడ ఎలా ఉంటుందో చూడాలి.


ఇదిలా ఉండగా “పుష్ప 2” మూవీ రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. తమిళనాడులో ఈ సినిమాను ఏకంగా 600 లొకేషన్స్ లో, 800 స్క్రీన్స్ లో మొదటి రోజున ఆల్మోస్ట్ 3500 షోలు వేయబోతున్నారు. ఇక ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ సినిమాకు 50 వేల టికెట్స్ అమ్ముడు అయినట్టుగా తెలుస్తోంది. అమెరికాలో ఈ సినిమాకు సంబంధించి ఏకంగా 3230 షోలను ప్రదర్శించబోతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×