Naga Chaitanya Sobhita Wedding: ఈరోజుల్లో పెళ్లి కూడా కమర్షియల్ అయిపోయింది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల విషయంలో అయితే ఇది పక్కా కమర్షియల్. అందుకే ఈ పెళ్లి వీడియోలను ఓటీటీలకు అమ్మడానికి ముందుకొస్తున్నారు సెలబ్రిటీలు. ఇక అలా పెళ్లి వీడియోలను ఓటీటీకి ఇచ్చేసి దానిని ఒక డాక్యుమెంటరీగా మార్చి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన మొదటి సౌత్ సెలబ్రిటీ నయనతార. నయన్ డాక్యుమెంటరీకి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినా దానికి వ్యూస్ కూడా బాగానే వచ్చాయి. దీంతో నాగచైతన్య, శోభితా కూడా తన రూట్‌నే ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యారు. తమ పెళ్లి వీడియోను ఓటీటీకి అమ్మనున్నారు.
నయనతార బాటలో
మామూలుగా బాలీవుడ్ సెలబ్రిటీలే తమ పెళ్లి వీడియోలను ఒక వెడ్డింగ్ ఫిల్మ్‌గా తయారు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. సౌత్ సెలబ్రిటీలు అలా చేయడం చాలా అరుదు. ఒకవేళ చేసినా కూడా దానిని కేవలం వారి సోషల్ మీడియాలో షేర్ చేసి సైలెంట్ అయిపోతారు. అలా ఇప్పటివరకు సినీ సెలబ్రిటీల వెడ్డింగ్ ఫిల్మ్స్ ఓటీటీ వరకు వెళ్లలేదు. కేవలం నయనతార మాత్రమే ముందుగా తన ప్రొఫెషనల్ లైఫ్‌లోని విశేషాలను పంచుకుంటూ, ఆ తర్వాత విఘ్నేష్ శివన్‌తో ప్రేమ, పెళ్లి గురించి చెప్తూ ఒక డాక్యుమెంటరీని సిద్ధం చేసింది. ఇప్పుడు నాగచైతన్య, శోభితా కూడా తమ ప్రేమకథ గురించి, పెళ్లి గురించి ఇదే విధంగా ప్రేక్షకులకు చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
Also Read: లేడీ సూపర్ స్టార్‌కే నా సపోర్ట్.. నయన్, ధనుష్ గొడవలో నటి జోక్యం
అన్ని విషయాలు తెలియాలి
ఇప్పటివరకు నాగచైతన్య (Naga Chaitanya), శోభితా (Sobhita) ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. అలాంటి వాళ్లిద్దరూ అసలు ఎలా పరిచయం అయ్యారు, వాళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలయ్యింది, పెళ్లి అనే పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నారు లాంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఈ విషయాన్ని వాళ్లు బయటపెట్టడానికి ఇష్టపడలేదు. అయితే వీరి పెళ్లిని ఒక వెడ్డింగ్ ఫిల్మ్‌గా తెరకెక్కిస్తే కచ్చితంగా ఇప్పటివరకు ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలు బయటపడతాయి. దీంతో ఆడియన్స్ కూడా ఈ వెడ్డింగ్ ఫిల్మ్ బయటికొస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు.
అదే ఫేవరెట్
నాగచైతన్య, శోభితా వెడ్డింగ్ ఫిల్మ్ గురించి ఐడియా రాగానే దానిని ఏ ఓటీటీకి ఇవ్వాలనే డిస్కషన్స్ కూడా మొదలయ్యాయట. నెట్‌ఫ్లిక్స్ అయితే 190 దేశాల్లో రీచ్ ఉంటుందని, వీరు కూడా నెట్‌ఫ్లిక్స్‌కే వెడ్డింగ్ ఫిల్మ్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. చైతూ, శోభితా పెళ్లికి టాలీవుడ్ నుండి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌ను తన కుమారుడికి గుర్తుండిపోయేలా చేయడానికి నాగార్జుననే ఏర్పాటు అన్నీ స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా నాగచైతన్య, సమంత పెళ్లి జరిగినప్పుడు కూడా ఇలాంటి ఒక వెడ్డింగ్ ఫిల్మ్ బయటికొచ్చింది. వీళ్లిద్దరూ విడిపోయినా కూడా ఇప్పటికీ చాలామందికి ఆ వెడ్డింగ్ ఫిల్మ్ ఫేవరెట్‌గా నిలిచిపోయింది.