Ranbir Kapoor: మామూలుగా సినిమాలు అనేవి సొసైటీ మీద చాలా ప్రభావం చూపిస్తాయి. వయసుతో సంబంధం లేకుండా అందరూ సినిమాలు చూస్తారు. ఈరోజుల్లో థియేటర్లలో సినిమాలు చూడలేని వారికి ఓటీటీల్లోనే అవి అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో సినీ పరిశ్రమ.. ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. అయితే ప్రేక్షకులు దీని వల్ల ఇంత ప్రభావితం అవుతున్నప్పుడు మంచి సినిమాలు చేయడం మేకర్స్ బాధ్యత అని ఇండస్ట్రీ నిపుణులు ఫీలవుతున్నారు. దానికి చెడు ఉదాహరణగా అందరికీ ముందుగా గుర్తొస్తున్న సినిమా ‘యానిమల్’. తన మూవీపై ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ రావడంపై రణబీర్ కపూర్ ఎట్టకేలకు స్పందించాడు.
స్పందించిన రణబీర్
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) నటించిన సినిమానే ‘యానిమల్’ (Animal). ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలయ్యి అంతకంటే పెద్ద బ్లాక్‌బస్టర్ అయ్యింది. కలెక్షన్స్ విషయంలోనే కాకుండా ప్రేక్షకులపై భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది ఈ మూవీ. కానీ ఇలాంటి వైలెన్స్, రక్తపాతం ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదని, ఎంతోమంది బాలీవుడ్ నటీనటులు, ఇండస్ట్రీ నిపుణులు దీనిని ఖండించడం మొదలుపెట్టారు. అయినా కూడా ‘యానిమల్’ థియేట్రికల్ రన్ ఆగలేదు. ఓటీటీలో విడుదలయినా కూడా ఈ సినిమాను థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలని వెళ్లిన ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. మొత్తానికి గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘యానిమల్’పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్‌పై రణబీర్ స్పందించాడు.
Also Read: మరణించిన తర్వాత కూడా 20 సినిమాలు విడుదల.. ఆ క్రేజీ నటుడు ఎవరంటే..?
నటులకు అది ముఖ్యం
‘‘ప్రేక్షకులు చెప్పిన మాట నిజమే. నటీనటులుగా సొసైటీలో పాజిటివ్ మార్పు తీసుకొచ్చే బాధ్యత మాకు ఉంది. కానీ అదే విధంగా ఒక నటుడిగా నేను వేర్వేరు జోనర్లలో ప్రయోగాలు చేస్తూ ఉండాలి. వివిధ పాత్రలను పోషించడానికి ప్రయత్నాలు చేయాలి. నటులు అనేవారు ఎప్పుడైనా ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధంగా ఉండాలి’’ అని పాజిటివ్‌గా స్పందించాడు రణబీర్ కపూర్. ‘యానిమల్’ సినిమా గురించి గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఎంతోమంది సీనియర్ నటీనటులు, టెక్నీషియన్స్.. రణబీర్ మొహం మీదే ‘యానిమల్’ గురించి నెగిటివ్ కామెంట్స్ చేస్తుండడంతో తను స్పందించక తప్పలేదు.
అప్పట్లో అలా
రణబీర్ కపూర్ తను ఎంచుకునే పాత్రల వల్ల చిక్కుల్లో పడడం ఇదేమీ మొదటిసారి కాదు. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ బయోపిక్‌గా తెరకెక్కిన ‘సంజు’లో కూడా రణబీరే హీరోగా నటించాడు. ఆ సమయంలో సంజయ్ దత్ జీవితంలో చేసిన కొన్ని తప్పులను కరెక్ట్ అన్నట్టుగా చూపించడం బాలేదంటూ మూవీ టీమ్‌పై విమర్శలు కురిపించారు ప్రేక్షకులు. ఇప్పుడు ‘యానిమల్’లో కూడా తను చేసిన పాత్రకు మరోసారి అదే రేంజ్‌లో నెగిటివిటీ వచ్చింది. ఈ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం నెగిటివ్ కామెంట్స్‌ను పట్టించుకోకుండా అవార్డులతోనే హేటర్స్‌కు సమాధానం చెప్పాడు.