Pushpa 2 : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించింది. అయితే తెలుగులో వరుసగా పాన్ ఇండియా సినిమాలు వస్తూనే ఉన్నాయి. తెలుగు నుంచి వస్తున్న చాలా సినిమాలు 1000 కోట్లు కలెక్షన్స్ వసూలు చేస్తున్నాయి. అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు చేసి సక్సెస్ కొట్టాలి అని మిగతా ఇండస్ట్రీ దర్శకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తెలుగు దర్శకులను మిగతా ఇండస్ట్రీ దర్శకులు పూర్తిస్థాయిలో అందుకోలేకపోతున్నారు అని చెప్పాలి. ఇదివరకే మణిరత్నం కూడా పొన్నియన్ సెల్వన్ అనే సినిమాతో పాన్ ఇండియా హిట్ కొడదామని అనుకున్నారు. కానీ ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అవ్వలేదు.
ఇకపోతే రీసెంట్ గా భారీ అంచనాలతో వచ్చిన సినిమా కంగువ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధిస్తుంది అని చాలామంది అంచనా వేశారు. ఈ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ ఈ సినిమా కోలీవుడ్ బాహుబలి అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుందా అని అడిగితే ఈ సినిమా 2000 కోట్లు వసూలు చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పుకొచ్చాడు. అలానే ఈ సినిమా గురించి మాట్లాడుతూ కంగువ పార్ట్ వన్ రిలీజ్ అయినప్పుడు కొన్ని సినిమాలు పోటీగా రిలీజ్ అవ్వచ్చు. కానీ పార్ట్ 2 రిలీజ్ అయినప్పుడు మాత్రం మిగతా సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవుతాయి అనే రేంజ్ లో కూడా మాట్లాడాడు. ఇకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కంప్లీట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది.
Also Read : Antony Thattil: కీర్తి సురేశ్ భర్త ఆంటోని తట్టిల్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
Also read : Allu Arjun: అల్లు స్నేహకు భయపడుతున్న బన్నీ.. అంతగా ఏం చేసి ఉంటుందో.. ?