BigTV English

Antony Thattil: కీర్తి సురేశ్ భర్త ఆంటోని తట్టిల్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Antony Thattil: కీర్తి సురేశ్ భర్త ఆంటోని తట్టిల్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Antony Thattil: మలయాళం నుండి వచ్చిన హీరోయిన్ అయినా కూడా ‘మహానటి’ సినిమాతో తెలుగులో ఎనలేని గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ కీర్తి సురేశ్. తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలావరకు మలయాళ పరిశ్రమకు దూరంగానే ఉంది కీర్తి. అయినా కూడా సౌత్ ప్రేక్షకుల్లో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోతంది అనగానే తన ఫ్యాన్స్ గుండె ముక్కలయ్యింది. కీర్తి పెళ్లి చేసుకోబోతుందని రూమర్స్ వచ్చినా చాలామంది ఇలాంటి రూమర్స్ కామన్ అని కొట్టిపారేశారు. మొత్తానికి పెళ్లి ఫోటోలు షేర్ చేసి అందరికీ క్లారిటీ ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. మరి కీర్తి భర్త ఆంటోని తట్టిల్ బ్యాక్‌గ్రౌండ్, ఆస్తుల విలువ ఎంతో తెలుసా?


ఆ కంపెనీకి డైరెక్టర్

కీర్తి సురేశ్ (Keerthy Suresh) ఒక సెలబ్రిటీ.. కానీ ఆంటోని మాత్రం మీడియాకు, పబ్లిసిటీకి చాలా దూరంగా ఉండే వ్యక్తి అని ఇప్పటికే అర్థమవుతోంది. అందుకే ఆంటోని ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి ఇప్పటికీ చాలామందికి తెలియదు. కీర్తి, ఆంటోని తమ కాలేజ్ రోజుల్లో కలిశారు. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలయ్యింది. ఆ తర్వాత కీర్తి హీరోయిన్ అయినా, సినిమాల్లోకి వచ్చినా వీరి ప్రేమ ఏ మాత్రం మారలేదు. ఆంటోని ఎమ్‌బీఏ పూర్తిచేసి బిజినెస్‌లోకి దిగాడు. తనకు కొచ్చిలో పలు రిసార్ట్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు ఆస్పిరోస్ అనే విండోస్ సొల్యూషన్స్ కంపెనీకి ఆంటోనీ తట్టిల్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈ కంపెనీలో కిటికీలు, కర్టెయిన్స్, బ్లైండ్స్ తయారవుతాయి.


Also Read: ఘనంగా కీర్తి సురేష్ పెళ్లి .. గోదాదేవి గెటప్ లో ఆకట్టుకున్న పెళ్లికూతురు..!

రెండు కంపెనీలు

ఆస్పిరోస్ అనే కంపెనీకి రెండు బ్రాంచ్‌లు ఉన్నాయి. ఒకటి చెన్నై, మరొకటి ఎర్నాకులమ్. ఇందులో ఆంటోని తట్టిల్‌తో పాటు మరొక అయిదుగురు పార్ట్‌నర్స్ ఉన్నారు. 15 ఏళ్లుగా కీర్తి సురేశ్, ఆంటోని రిలేషన్‌షిప్‌లో ఉన్న వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు ఏవీ బయటికి రాలేదు. వాళ్లు రిలేషన్‌షిప్‌ను అంత ప్రైవేట్‌గా ఉంచగలిగారు. డిసెంబర్ 12న కీర్తి సురేశ్ పెళ్లి అని ఏదో ఒక విధంగా వార్త బయటికొచ్చింది. దీంతో దాచి లాభం లేదని ఆంటోనీతో కలిసున్న ఫోటోను షేర్ చేసి వారి 15 ఏళ్ల రిలేషన్‌షిప్ గురించి బయటపెట్టింది కీర్తి. దీంతో తన భర్త ఆంటోని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

ఆస్తుల విలువ

ఆంటోని తట్టిల్ (Antony Thattil) ఆస్తుల విలువ దాదాపు రూ.150 నుండి 200 కోట్ల ఉండవచ్చని సమాచారం. ఇండియాలో, దుబాయ్‌లో తనకు ఉన్న వ్యాపారాల విలువ అంతా కలిపితే రూ.100 కోట్లపైనే ఉంటుందని తెలుస్తోంది. ఆంటోనికి చెన్నై, కేరళలో వ్యాపారాలు ఉన్నా తను దుబాయ్‌లో ఉంటూ వీటిని చూసుకుంటాడట. ఇక కీర్తి సురేశ్ హీరోయిన్‌గా తన కెరీర్‌లో బిజీ ఉన్నప్పుడు కూడా ఆంటోని చాలా సపోర్ట్ చేసేవాడని సన్నిహితులు చెప్తున్నారు. మొత్తానికి 2024కు తన పెళ్లితో గ్రాండ్‌గా ఎండ్ ఇచ్చింది కీర్తి సురేశ్. సెలబ్రిటీలు అంతా ఈ కొత్త జంటకు కంగ్రాట్స్ చెప్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×