Sandhya Theater stampede : ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ కలెక్షన్ల పరంగా మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా వివాదం కూడా అదే రేంజ్ లో చిత్ర బృందాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ వివాదంలో సంధ్య థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ (Allu Arjun) పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఇందులో ‘పుష్ప 2’ మూవీని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) పేరు కూడా చేర్చినట్టుగా తెలుస్తోంది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ బాలుడు కోరుకుంటున్నాడు. కానీ మరోవైపు అల్లు అర్జున్ ఈ వివాదంలో రోజురోజుకు మరింతగా కూరుకుపోతున్నారు. తాజాగా అల్లు అర్జున్ ను విచారణ పేరుతో చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ కు పోలీసులు పిలిపించిన సంగతి తెలిసిందే.
ప్రశ్నల వర్షంతో దాదాపు మూడు గంటల పాటు విచారణ చేసిన తర్వాత ఆయనను తిరిగి ఇంటికి పంపించారు. ఈ నేపథ్యంలోనే మరోసారి అల్లు అర్జున్ ను విచారణ పేరుతో పిలుస్తారా ? అని అనుమానాలు నెలకొన్నాయి. అయితే అంతలోనే తొక్కిసలాట ఘటనలో నిర్మాతలకు పోలీసులు షాక్ ఇచ్చారు. చార్జ్ షీట్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల పేర్లు కూడా చేర్చినట్టుగా తెలుస్తోంది.
ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ ని A 11గా పేర్కొనగా, తాజాగా ప్రొడ్యూసర్లను ఈ కేసులో A 18 గా చేర్చినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ విచారణ అనంతరం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిందితుల కంప్లీట్ లిస్ట్ చూస్తే… A18 గా మైత్రి మూవీ మేకర్స్ ను చేర్చారు. A1 to A8 వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యం, మేనేజర్ ఉండగా, A 9, A10 సంధ్య సెక్యూరిటీ మేనేజర్, ఫ్లోర్ ఇన్చార్జిని, A11 గా అల్లు అర్జున్ ను ఇప్పటికే చేర్చారు పోలీసులు. A 12 టు A17 గా బౌన్సర్స్, సెక్యూరిటీ… A18 మైత్రి మూవీ మేకర్స్ ను చేర్చారు పోలీసులు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసుల ఛార్జ్ షీట్
A18 – పుష్ప 2 మూవీ నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్కాగా ఇప్పటికే శ్రీ తేజ్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి ఆ బాలుడిని పరామర్శించారు ‘పుష్ప 2’ నిర్మాతలు. డిసెంబర్ 23న నవీన్ యర్నేని (Naveen Yerneni), యలమంచిలి రవిశంకర్ (Ravi Shankar), సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డితో కలిసి కిమ్స్ ఆస్పత్రికి వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్న నిర్మాతలు, ఈ సందర్భంగా 50 లక్షలు చెక్కును రేవతి కుటుంబానికి అందజేశారు.
తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోవడం చాలా బాధాకరమని, కానీ ప్రస్తుతం శ్రీ తేజ్ కోరుకుంటున్నారని అన్నారు. ఇక బాధిత కుటుంబానికి సాయం చేయడానికి ఇక్కడికి వచ్చామని, వారికి ఎప్పటికీ అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. కానీ నిర్మాతలు శ్రీతేజ్ ని పరామర్శించి 24 గంటలు కూడా గడవక ముందే వాళ్ల పేర్లును ఛార్జ్ షీట్ లో చేర్చడం హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ తో పాటు నిర్మాతలు ఎంత ప్రయత్నించినా ఈ వివాదం చల్లబడట్లేదు సరికదా, అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మరింత వివాదాస్పదం అవుతోంది. ఇప్పుడు ఈ వివాదం రాజకీయ రంగు పులుకుంది.