Wamiqa Gabbi: సోషల్ మీడియా వచ్చాకా ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతున్నారో వారికే తెలియడం లేదు. ఒక డ్యాన్స్ రీల్ చేస్తే ఫేమస్.. ఒక క్యూట్ ఎక్స్ ప్రెషన్ ఇస్తే ఫేమస్, అమ్మాయిలు బూతులు మాట్లాడితే ఫేమస్.. రీ రిలీజ్ సినిమా థియేటర్ లో డ్యాన్స్ వేస్తే ఫేమస్.. ఇలా ఏదైనా వైరల్ గా మారడం ఆలస్యం.. వారి గురించే సోషల్ మీడియాలో చర్చలు మొదలవుతాయి. అంతెందుకు అనాథలా వైరల్ అయ్యింది కాబట్టే.. ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసింది అందాల ముద్దుగుమ్మ ఇమాన్వి.
ఇలా చాలామంది చిన్న చిన్న వీడియోస్ తో ఫేమస్ అయ్యి ఇప్పుడు స్టార్స్ గా మారారు. ఇక నేటి ఉదయం నుంచి బాలీవుడ్ బ్యూటీ వామిక గబ్బీ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఫొటోగ్రాఫర్లను పక్కకు పిలిచి ఎంతో అందంగా వారితో మాట్లాడుతూ ఫోటోలకు ఫోజులిచ్చిన ఈ చిన్నదాని వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో అసలు ఎవర్రా ఈ వామిక అని గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. వామిక ఒక బాలీవుడ్ నటి.
Allu Arjun Interrogation : మూడున్నర గంటల విచారణ… పీఎస్ నుంచి వెళ్లిపోయిన బన్నీ..!
2007 లో షాహిద్ కపూర్, కరీనా కపూర్ జంటగా నటించిన జబ్ వియ్ మెట్ అనే సినిమాలో కీలక పాత్రలో నటించి తన కెరీర్ ను ప్రారంభించింది. అలా చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన వామిక తు మేరా 22 మెయిన్ తేరా 22 అనే సినిమాలో హీరోయిన్ గా మారింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో.. ఆమె వరుస సినిమాలతో బిజీగా మారింది. తెలుగులో కూడా వామిక ఎంట్రీ ఇచ్చింది. సుధీర్ బాబు హీరోగా నటించిన భలే మంచిరోజు అనే సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోవడంతో ఆ ఒక్క సినిమాకే అమ్మడు పరిమితమయ్యింది. ఇక బాలీవుడ్ లోనే కష్టపడుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.
ఇక ఈ చిన్నదాని పేరు తెలియకపోవచ్చేమో కానీ, అమ్మడి అందాల ఆరబోత కానీ, అమ్మడి ఇంటిమేటెడ్ సీన్స్ ను కానీ ఎవరు మర్చిపోలేరు. ముఖ్యంగా కుఫియా వెబ్ సిరీస్ లో అమ్మడి ఘాటు రొమాన్స్ కు ఫిదా కానీ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో ఆమెకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అప్పట్లో అమ్మడి ప్రతిభను ఎవరు గుర్తించలేకపోయారు. ఇదుగో ఇప్పుడు ఈ వీడియోలో ఆమెను చూసి.. ఎవర్రా ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంది.. అంటూ చెప్పుకొస్తున్నారు.
Sandhya Theatre Stampede : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ప్రస్తుతం వామిక.. బేబీ జాన్ సినిమాలో నటిస్తుంది. వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా అట్లీ నిర్మిస్తున్న చిత్రం బేబీ జాన్. ఈ సినిమా రేపు క్రిస్టమస్ కానుకగా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇందులో వామిక సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే వామిక తెలుగు ప్రేక్షకుల కళ్ళలో పడింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఈ భామ రేపు ఈ సినిమా విజయం అందుకుంటే..ఖచ్చితంగా స్టార్ గా మారుతుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. మరి బేబీ జాన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.