Pushpa 2: ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ‘పుష్ప 2’ (Pushpa 2) గురించే మాట్లాడుకుంటున్నారు. ‘పుష్ప’ విడుదలయ్యి మూడేళ్లు అయ్యింది. అంటే మూడేళ్లుగా ఈ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉన్నారు. మధ్యలో ఈ సీక్వెల్ ఆగిపోయిందని, ఇక ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ లేదని, ఇప్పటివరకు ఖర్చుపెట్టిన బడ్జెట్ వేస్ట్ అని.. ఇలా చాలా రూమర్స్ వచ్చాయి. కానీ ఇంతలోనే డిసెంబర్ 5న ‘పుష్ప 2’ విడుదల తేదీ ఖరారు చేసుకుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. తాజాగా ఈ మూవీ రన్ టైమ్ బయటికి రావడంతో ఇది ప్రేక్షకుల్లో మరొక హాట్ టాపిక్‌గా మారనుంది.
ఆ సినిమాను ఫాలో
అసలు సినిమా అంటే రెండున్నర గంటలు మాత్రమే ఉంటుంది అని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యింటారు. కానీ ఈమధ్య కాలంలో సినిమా అంటే రెండున్నర గంటలు ఉండాల్సిన అవసరం లేదని, ఆసక్తికరంగా తెరకెక్కిస్తే మూడు గంటలు అయినా ఆడియన్స్ ఆదరిస్తారని మేకర్స్ ఫిక్స్ అయిపోయారు. ముందుగా రెండున్నర గంటల రూల్‌ను బ్రేక్ చేసి ప్రేక్షకులను ఆదరించిన సినిమా ‘యానిమల్’. ఇప్పుడు ‘పుష్ప 2’ కూడా అదే రూట్‌ను ఫాలో అవ్వనుంది. తాజా సమాచారం ప్రకారం.. ‘పుష్ప 2’ రన్ టైమ్ 3 గంటల 20 నిమిషాలుగా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. దీంతో అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్‌లో మిక్స్‌డ్ ఫీలింగ్స్ మొదలయ్యాయి.
Also Read: ‘పుష్ప 2’ మ్యూజిక్ డైరెక్టర్ కాంట్రవర్సీ.. డీఎస్‌పీ మాటలపై స్పందించిన నిర్మాత
రన్ టైమ్‌పై క్లారిటీ
తాజాగా ‘పుష్ప 2’కు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు సమాచారం. పైగా ఈ మూవీలో 8 నుండి 12 కట్స్ కూడా చేసిందట సెన్సార్ బోర్డ్. అవేంటి అనే వివరాలు ఇంకా బయటికి రాలేదు. కానీ మూవీ రన్ టైమ్ గురించి మాత్రం సోషల్ మీడియాలో చర్చ మొదలుకానుంది. ఇప్పటికే ‘పుష్ప 2’ రన్ టైమ్ 3 గంటల 20 నిమిషాలు ఉంటుందనే వార్త బయటికి వచ్చింది. దీనిపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా స్పందించారు. అసలు సినిమా 3 గంటల 20 నిమిషాలు లాగా ఉందని ప్రేక్షకులు ఫీల్ అవ్వరు అని, రెండున్నర గంటలు లాగానే ఫీలవుతారని, సుకుమార్ (Sukumar) అంత బాగా తెరకెక్కించారని నిర్మాతలు అన్నారు. దీంతో అప్పుడే రన్ టైమ్ ఇంతే అని అందరికీ క్లారిటీ వచ్చేసింది.
కలెక్షన్స్‌పై ఎఫెక్ట్
‘పుష్ప 2’ రన్ టైమ్ గురించి బయటికి రాగానే ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలయ్యింది. ఇప్పటికే ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అదే విధంగా మూవీ టీమ్ కూడా విరామం లేకుండా అన్ని రాష్ట్రాలు చుట్టేస్తూ ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రతీ రాష్ట్రంలో ‘పుష్ప 2’ టీమ్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్ లభిస్తోంది. కానీ ఒకేఒక్క నెగిటివ్ పాయింట్ ఏంటంటే.. ఇప్పటికే ఈ సీక్వెల్ కోసం ప్రేక్షకులు మూడేళ్లు ఎదురుచూశారు. అందుకే సినిమాకు కాస్త మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. కచ్చితంగా అది కలెక్షన్స్‌పై భారీ ఎఫెక్ట్ చూపిస్తుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు.