BigTV English
Advertisement

Pushpa 2: ‘పుష్ప 2’ మ్యూజిక్ డైరెక్టర్ కాంట్రవర్సీ.. డీఎస్‌పీ మాటలపై స్పందించిన నిర్మాత

Pushpa 2: ‘పుష్ప 2’ మ్యూజిక్ డైరెక్టర్ కాంట్రవర్సీ.. డీఎస్‌పీ మాటలపై స్పందించిన నిర్మాత

Pushpa 2: ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు.. అన్ని భాషా ప్రేక్షకుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది ‘పుష్ప 2’. సుకుమార్ (Sukumar), అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించింది. దాని సీక్వెల్ కోసం ఆడియన్స్ అంతా మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న ఈ మూవీ విడుదల అవుతుందని ప్రకటించినా కూడా ఇంకా చాలామంది ప్రేక్షకులకు నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఈ మూవీ ఎడిటింగ్ పూర్తికాలేదని, మ్యూజిక్ సిద్ధంగా లేదని.. ఇలా చాలా పుకార్లు వినిపిస్తున్నాయి. తాజాగా స్టేజ్‌పైనే నిర్మాతలపై సీరియస్ అయ్యాడు దేవీ శ్రీ ప్రసాద్. దానిపై తాజాగా నిర్మాత స్పందించాడు.


నిర్మాత క్లారిటీ..

‘పుష్ప’ విడుదలయ్యి మూడేళ్లు అయ్యింది. మేకర్స్ సరిగ్గా దృష్టిపెడితే ‘పుష్ప 2’ (Pushpa 2)ను అదిరిపోయే అప్డేట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చని, కానీ వారి నిర్లక్ష్యం వల్లే ఇంకా విడుదల తేదీ దగ్గర పడుతున్నా పనులు పూర్తికాలేదని చాలామంది ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బయటవారికి మాత్రమే కాదు.. సినిమా కోసం పనిచేసే వారిపై కూడా చివరి నిమిషంలో మార్పులు చేయాలనే ప్రెజర్ పడుతోంది. అలాగే మ్యూజిక్ విషయంలో దేవీ శ్రీ ప్రసాద్‌పై కూడా ప్రెజర్ పడినట్టుంది. అందుకే తాజాగా చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలపై సీరియస్ అయ్యాడ. తనపై నిర్మాతలకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయని అన్నాడు.


Also Read: చివర్లో దేవిశ్రీ, తమన్ లకు కి షాక్ ఇచ్చిన టీమ్.. ఫైనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే..?

అందులో తప్పేముంది.?

తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్.. దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కామెంట్స్‌పై స్పందించారు. ‘‘దేవీగారు ఏమన్నారు? మావాళ్లకు నా మీద చాలా లవ్ ఉంటుంది. దాంతో పాటు ఈమధ్య నాపై కంప్లైంట్స్ కూడా ఎక్కువయ్యాయని అన్నారు. సింపుల్‌గా అదే మ్యాటర్. అందులో తప్పేముంది? మాకైతే అందులో తప్పేమీ కనిపించలేదు. తర్వాత మీరు ఇచ్చిన ఆర్టికల్స్ చూసి అది తప్పు అనుకున్నారు. మేమంతా ఒక ఫ్యామిలీ. ఆయన మాతో సినిమాలు చేస్తారు. మేము ఉన్నంతవరకు ఆయనతో సినిమాలు చేస్తాం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు’’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు రవి శంకర్.

విడుదలయితే చాలు..

నిర్మాత మామూలుగానే స్పందించినా.. చెన్నై ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దేవీ శ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు మాత్రం పెద్ద దుమారాన్నే రేపాయి. నిర్మాతలు తనపై, తన మ్యూజిక్ లేట్ అవుతుంది అనే విషయంపై కంప్లైంట్స్ చేయడం గురించి ఆయన సరదాగా చెప్పినట్టు ప్రేక్షకులకు అనిపించిలేదు. దీంతో ‘పుష్ఫ 2’ లేట్ అవ్వడం వెనుక ఇలాంటి మరెన్నో కారణాలు ఉన్నాయని ఫీలవుతున్నారు. మేకర్స్ మధ్య మనస్పర్థలు వచ్చాయని, ఒకరి డిపార్ట్‌మెంట్‌లో మరొకరు జోక్యం చేసుకోవడం జరుగుతుందని, అందుకే ఇప్పటికీ ఔట్‌పుట్‌పై డౌట్ ఉందని.. ఇలా ఎన్నో రూమర్స్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. ఏం జరిగినా కూడా డిసెంబర్ 5న ‘పుష్ప 2’ థియేటర్లలో విడుదలయితే అదే చాలు అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×